అతను ఎస్సీ స్టేజ్ ఎక్కకూడదు.. ఏపీలో కూటమి ఎమ్మెల్యే నిర్వాకం
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితుల పట్ల వివక్ష బయటపడిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, ఆదోనిలో జరిగిన ఒక ఘటన దీనికి నిదర్శనంగా మారింది. కూటమి ఎమ్మెల్యే పార్థసారథి నిర్వహించిన సదస్సులో దళిత సర్పంచ్‌ను అవమానించిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సదస్సు ప్రారంభంలో ఎమ్మెల్యే పార్థసారథి దళిత సర్పంచ్‌ను వేదికపైకి రావాలని స్వయంగా ఆహ్వానించారు. అయితే, పక్కనే ఉన్న ఒక టీడీపీ నాయకురాలు సర్పంచ్ ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పి, వేదికపైకి రాకుండా వారించినట్లు తెలుస్తోంది. దీంతో, ఎమ్మెల్యే పార్థసారథి వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకుని, సర్పంచ్‌ను వేదిక కిందే ఆపేశారు.

తాజాగా దీనిపై ఎమ్మెల్యే పార్థసారథి స్పందించారు.జరిగిన ఘటనపై ఆయన క్షమాపణలు కోరారు.సదరు సర్పంచ్‌ను సైతం ఆయన క్షమించమని కోరారు.భవిష్యత్తులో ఇలాంటి పొరబాటులకు తావులేకుండా చూసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications