రాజమౌళికి సంబంధించిన కీలక విషయం లీక్?
బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో దర్శకుడు రాజమౌళి ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. జక్కన్న దర్శకత్వంలో త్వరలోనే మహాభారతం రూపుదిద్దుకోబోతోంది. ఈ సినిమాకు కథ అందించనున్న రచయిత విజయేంద్రప్రసాద్ దీనికి సంబంధించిన కొన్ని హింట్స్ ఇచ్చారు. మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ రాజమౌళి పది సంవత్సరాల క్రితమే వెల్లడించారు. దీంతో ఆయన మహాభారతాన్ని ఎప్పుడెప్పుడు తీస్తారా? అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆయన బాహుబలికన్నా ముందే చెప్పారు ఈ విషయాన్ని.
శ్రీ రాముడి ఇతివృత్తంతో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో మరోసారి రాజమౌళి తెరకెక్కించనున్న మహాభారత్ గురించి చర్చ ప్రారంభమైంది. ఈ సినిమాను 3-4 భాగాలుగా తీస్తేనే సరిగ్గా సెట్ అవుతుందని, లేదంటే అసంపూర్తిగా ఉంటుందని గతంలోనే రాజమౌళి స్వయంగా చెప్పారు. ఆయన లెక్కల్లో చెప్పాలంటే దాదాపు 10 సంవత్సరాలు పడుతుందనే అంచనా వేస్తున్నారు.

తాజాగా మహాభారత్ ప్రాజెక్టు గురించి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కీలకమైన అప్‌డేట్ ఇచ్చారు. ప్రస్తుతం మహేశ్ బాబుతో రాజమౌళి చేస్తున్న సినిమా పూర్తయ్యాక వచ్చే ఏడాది మహాభారత్ సినిమాకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం మహేశ్ బాబుతో చేస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్‌ను మించి ఉంటుందని విజయేంద్రప్రసాద్ చెప్పారు. త్వరలోనే ఆర్ఆర్ఆర్ 2 ఉంటుందని తెలిపారు. అంటే దాదాపుగా రెండు సంవత్సరాల తర్వాత మహాభారతానికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యే అవకాశం కనపడుతోంది.












Click it and Unblock the Notifications