వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏఐఏడబ్ల్యూయు సభ: అలరించిన నృత్యాలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

వరంగల్: వ్యవసాయ రంగంలో వస్తోన్న సరళీకృత విధానాలే రైతుల ఆత్మహత్యకు కారణం అవుతున్నాయని మార్కిస్ట్ ఆర్థికవేత్త, ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన ఫ్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ అన్నారు. వ్యవసాయరంగం నిర్లక్ష్యానికి గురికావడంతో వ్యవసాయ కూలీలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

వరంగల్‌లో నిర్వహిస్తున్న అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం 8వ జాతీయ మహాసభ ప్రతినిధుల సమావేశం గురువారం ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ ప్రారంభించారు. సంఘం జాతీయ అధ్యక్షుడు పాటూరి రామయ్య అధ్యక్షతన జరిగిన ప్రతినిధుల సమావేశంలో ప్రభాత్ పట్నాయక్ మాట్లాడుతూ.. భారతదేశం వ్యవసాయరంగంపై ఆధారపడి ఉండగా, ప్రభుత్వాల సరళీకరణ విధానాల కారణంగా రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని తెలిపారు.

ఉపాధి అనేది ప్రజల ప్రాథమిక హక్కుగా ఉండాలని స్పష్టం చేశారు. బ్యాంకింగ్ రంగంలో విదేశీ పెట్టుబడులను అనుమతించడం ద్వారా బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు ఎన్డీఎ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. ఇది జరిగితే బ్యాంకులపై సామాజిక బాధ్యత తొలగిపోతుందని, రైతులకు, పేదలకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు, తక్కువ వడ్డీ రుణాలు అందే అవకాశం ఉండదని చెప్పారు. వ్యవసాయరంగంలో ఏర్పడిన సంక్షోభాన్ని సత్వరంగా నివారించకుంటే ముప్పు తప్పదని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాటూరి రామయ్య వ్యవసాయ కార్మిక సంఘం జెండాను ఎగురవేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శి విజయరాఘవన్, సిపిఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు రాఘవులు, సిపిఎం ఆంధ్రప్రదేశ్ శాఖ కార్యదర్శి మధు, వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నాగయ్య, ప్రధాన కార్యదర్శి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ సభలు

వ్యవసాయ సభలు

వ్యవసాయ రంగంలో వస్తోన్న సరళీకృత విధానాలే రైతుల ఆత్మహత్యకు కారణం అవుతున్నాయని మార్కిస్ట్ ఆర్థికవేత్త, కేరళ ప్రణాళిక బోర్డు మాజీ చైర్మన్, ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన ఫ్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ అన్నారు.

వ్యవసాయ సభలు

వ్యవసాయ సభలు

వ్యవసాయరంగం నిర్లక్ష్యానికి గురికావడంతో వ్యవసాయ కూలీలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

వ్యవసాయ సభలు

వ్యవసాయ సభలు

వరంగల్‌లో నిర్వహిస్తున్న అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం 8వ జాతీయ మహాసభ ప్రతినిధుల సమావేశం గురువారం ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ ప్రారంభించారు.

వ్యవసాయ సభలు

వ్యవసాయ సభలు

సంఘం జాతీయ అధ్యక్షుడు పాటూరి రామయ్య అధ్యక్షతన జరిగిన ప్రతినిధుల సమావేశంలో ప్రభాత్ పట్నాయక్ మాట్లాడుతూ.. భారతదేశం వ్యవసాయరంగంపై ఆధారపడి ఉండగా, ప్రభుత్వాల సరళీకరణ విధానాల కారణంగా రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని తెలిపారు.

వ్యవసాయ సభలు

వ్యవసాయ సభలు

సరళీకృత ఆర్థిక విధానాల పేరుతో వ్యవసాయరంగంలో రైతులకు విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులపై అందించే సబ్సిడీలను తగ్గించడంతోపాటు రైతులు పండించిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించని కారణంగా రైతులలో ఆందోళన మొదలయిందని, దీని ప్రభావం రైతుకూలీలు, గ్రామీణ పేదలపై పడుతోందని చెప్పారు.

వ్యవసాయ సభలు

వ్యవసాయ సభలు

ప్రభుత్వం ప్రస్తుతం అవలంభిస్తున్న ఆర్థిక విధానాలు, వ్యవసాయరంగంలో అందిస్తున్న ప్రోత్సాహకాలు రైతులకు, రైతుకూలీలకు కాకుండా బహుళజాతి సంస్థలకు, పెట్టుబడిదారులకు ప్రయోజనకరంగా మారాయని ఆరోపించారు.

వ్యవసాయ సభలు

వ్యవసాయ సభలు

ప్రభుత్వ విధానాలతో ఆహార ధాన్యాల ఉత్పత్తి, ఆహార లభ్యత మధ్య వ్యత్యాసం పెరుగుతోందని, ఇది భారత సమాజానికి ప్రమాదకరమని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం లభించి దశాబ్ధాలు గడచిన ప్రజల అవసరాల మేరకు ఆహారధాన్యాల ఉత్పత్తి పెరగకపోవడం శోచనీయమని అన్నారు

అలరించిన నృత్యాలు

అలరించిన నృత్యాలు

ఆకలి, పోషకాహార లభ్యత విషయంలో భారతదేశం ఆఫ్రికా దేశాల కంటే వెనకబడిందని, ప్రతి వ్యక్తికి 2400క్యాలరీలు అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తుండగా 2200క్యాలరీలు మాత్రమే అందుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయని ప్రభాత్ పట్నాయక్ తెలిపారు.

అలరించిన నృత్యాలు

అలరించిన నృత్యాలు

ఒకపక్క దేశంలోని గోదాములలో 82మిలియన్ టన్నుల ఆహారధాన్యాలను నిల్వ చేసిన ప్రభుత్వం దేశంలోని పేదప్రజలకు తిండిగింజలు అందించడంలో మాత్రం విఫలమయిందని విమర్శించారు.

అలరించిన నృత్యాలు

అలరించిన నృత్యాలు

గోదాములలోని ఆహారధాన్యాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే విషయంలో శ్రద్ధ చూపుతున్న ప్రభుత్వం దేశంలోని పేదల ఆకలిని తీర్చడాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

అలరించిన నృత్యాలు

అలరించిన నృత్యాలు

అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, బహుళజాతి సంస్థల ఒత్తిడి తీసుకువచ్చి పేదలకు ప్రజాపంపిణీ విధానంలో ఆహారధాన్యాలు అందకుండా చూస్తున్నాయని విమర్శించారు.

అలరించిన నృత్యాలు

అలరించిన నృత్యాలు

వామపక్షాలు, వ్యవసాయ కార్మిక సంఘాల పోరాటం, ఆందోళన కారణంగా దేశంలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని యుపిఏ ప్రభుత్వం ప్రవేశపెడితే ఎన్డీఎ ప్రభుత్వం ఆ పథకాన్ని నీరుగారుస్తోందని ప్రభాత్ పట్నాయక్ ఆరోపించారు.

అలరించిన నృత్యాలు

అలరించిన నృత్యాలు

ఉపాధి అనేది ప్రజల ప్రాథమిక హక్కుగా ఉండాలని స్పష్టం చేశారు. బ్యాంకింగ్ రంగంలో విదేశీ పెట్టుబడులను అనుమతించడం ద్వారా బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు ఎన్డీఎ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు.

అలరించిన నృత్యాలు

అలరించిన నృత్యాలు

ఇది జరిగితే బ్యాంకులపై సామాజిక బాధ్యత తొలగిపోతుందని, రైతులకు, పేదలకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు, తక్కువ వడ్డీ రుణాలు అందే అవకాశం ఉండదని ప్రభాత్ చెప్పారు.

వ్యవసాయ సభలు

వ్యవసాయ సభలు

ఈ కార్యక్రమంలో సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి విజయరాఘవన్, సిపిఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు రాఘవులు, సిపిఎం ఆంధ్రప్రదేశ్ శాఖ కార్యదర్శి మధు, వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నాగయ్య, ప్రధాన కార్యదర్శి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

English summary
Agrarian economy was in good health under the colonial era than in free India, observed JNU professor and noted economist, Prabhat Patnaik.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X