అగ్రిగోల్డ్ బాధితుల ర్యాలీ: కలెక్టరేట్ ముట్టడి (ఫోటోలు)
విశాఖపట్నం: అగ్రిగోల్డ్ బాధితులు సోమవారం విశాఖలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఆ సంస్ధను నమ్ముకొని లక్షల రూపాయలు డిపాజిట్ చేసి మోసపోయామంటూ విసాఖ, శ్రీకాకుళం, విజయనగరం, ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఒడిస్సా రాష్ట్రానికి చెందిన వేలాది మంది బాధితులు, ఏజెంట్లు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సోమవారం నిరసన తెలిపారు.
ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ నష్టపోయిన బాధితులు ఆత్మహత్యలు చేసుకోకముందే న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ సంస్ధను డిమాండ్ చేశారు. అక్కడి నుంచి కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీగా తరలివెళ్లారు.

అగ్రిగోల్డ్ బాధితుల ర్యాలీ: కలెక్టరేట్ ముట్టడి
తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తూ కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు కలెక్టరేట్ గేట్లను మూసివేసి వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, బాధితులకు మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది.

అగ్రిగోల్డ్ బాధితుల ర్యాలీ: కలెక్టరేట్ ముట్టడి
దీంతో వారంతా కలెక్టరేట్ గేట్ ముందు బైఠాయించారు. వీరిక మద్దతు పలికేందుకు వచ్చిన అగ్రిగోల్డ్ సంస్ధ డైరెక్టర్లు కోటేశ్వరరావు, రామ్మోహనరావు, బాలకృష్ణలపై బాధితులు, ఏజెంట్లు తిరగబడ్డారు. నాలుగు నెలలుగా ఫోన్ చేస్తే పట్టించుకోవడం లేదంటూ ఓ బాధితుడు డైరెక్టర్ కోటేశ్వరరావును నిలదీశాడు.

అగ్రిగోల్డ్ బాధితుల ర్యాలీ: కలెక్టరేట్ ముట్టడి
దీనిపై ఆగ్రహించిన డైరెక్టర్ కోటేశ్వరరావు 'నువ్వు నాకు డబ్బు కట్టావా?' అంటూ ప్రశ్నించడంతో బాధితులంతా డైరెక్టర్లపై తిరగ బడ్డారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని బాధితులను చెదరగొట్టారు.

అగ్రిగోల్డ్ బాధితుల ర్యాలీ: కలెక్టరేట్ ముట్టడి
అనంతరం కొంత మంది బాధితులు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications