ఆ 15 మందికి లోకసభ టిక్కెట్లు, లేని ఆ ఆరుగురు పేర్లు

రాష్ట్ర విభజన అనంతర పరిణామాలను దృష్టిలో పెట్టుకొని బొత్స లిస్ట్ పంపించారని సమాచారం. విభజన నిర్ణయం నేపథ్యంలో కొందరు పార్టీ మారే అవకాశాలున్నాయి. దానిని బొత్స పరిగణలోకి తీసుకున్నారట. ఎవరైతే పార్టీకి కట్టుబడి ఉంటారో వారి పేర్లను తొలుత పంపించారట. ఇటీవల అధిష్టానంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన ఆరుగురు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల పేర్లు ఆ లిస్టులో లేవని తెలుస్తోంది.
మరోవైపు లోకసభ, అసెంబ్లీ నియోజవర్గాలకు ఒక్కో నియోజకవర్గం నుండి ముగ్గురేసి పేర్లను సమర్పించాలని అధిష్టానం పరిశీలకులను కోరినట్లుగా తెలుస్తోంది.
లోకసభ నియోజకవర్గాలకు తగిన పేర్లను సూచించేందుకు ఒక్కో లోకసభ స్థానానికి ఒక్కో పరిశీలకుడి చొప్పున మొత్తం 42 మందిని ఎఐసిసి ఎంపిక చేసింది. ఇందులో పలువురు ఇప్పటికే రాష్ట్రానికి వచ్చారు. ఆయన లోకసభ నియోజకవర్గాల పరిధిలో అభిప్రాయ సేకరణ చేపట్టారు. పరిశీలకుల అభిప్రాయ సేకరణలో కొన్నిచోట్ల వివాదాలు చోటు చేసుకున్నాయి.
సమాచారం మేరకు మన రాష్ట్రం నుండి పదిహేనుమంది లోకసభ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. అందులో... కిల్లి కృపారాణి (శ్రీకాకుళం), బొత్స ఝాన్సీ (విజయనగరం), పళ్లం రాజు (కాకినాడ), కావూరి సాంబశివ రావు (ఏలూరు), పనబాక లక్ష్మి (బాపట్ల), మాగుంట శ్రీనివాసులు రెడ్డి (ఒంగోలు), చింతా మోహన్ (తిరుపతి), కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి (కర్నూలు), జైపాల్ రెడ్డి (చేవెళ్ల), బలరాం నాయక్ (మహబూబాబాద్), మధుయాష్కీ (నిజామాబాద్), గుత్తా సుఖేందర్ రెడ్డి (నల్గొండ), అంజన్ కుమార్ యాదవ్ (సికింద్రాబాద్), రాజయ్య (వరంగల్), సర్వే సత్యనారాయణ (మల్కాజిగిరి)












Click it and Unblock the Notifications