వైసిపిలోకి ఆలీ.. మాగంటి చేరిక ఖ‌రారు:ఆ ఇద్ద‌రి పోటీ అక్క‌డి నుండే: తొలి జాబితా..బ‌స్ యాత్ర‌..!

వైసిపిలో చేరిక‌లు తుది ద‌శకు చేరుకున్నాయి. ఈ రెండు రోజుల్లో కీల‌క నేత‌లు వైసిపి లో చేరుతార‌ని పార్టీ నేత‌లు చెబు తున్నారు. ఎన్నిక‌ల షెడ్యూల్ రావ‌టంతో ఈ రోజు రేప‌ట్లో చేరిక‌ల ప్ర‌క్రియ పూర్తి చేయాల‌ని పార్టీ అధినేత జ‌గ‌న్ భావిస్తు న్నారు. 12న వైసిపి ఆవిర్భావం దినోత్స‌వం కావ‌టంతో అదే రోజు కీల‌క నేత‌లు పార్టీలోకి రానున్నారు. ఇక‌, అభ్య‌ర్ధుల జాబి తా విడుద‌ల చేయ‌టం..ఆ వెంట‌నే బ‌స్సు యాత్ర‌కు జ‌గ‌న్ సిద్దం అవుతున్నారు.

నేడు ఆలీ చేరిక‌..

సినీ న‌టుడు ఆలీ వైసిపి లో చేరుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న టిడిపిలో చేరుతున్నార‌ని గుంటూరు తూర్పు నియో జ‌క‌వ‌ర్గం నుండి పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అంత‌కు ముందు ఆయ‌న ప‌వ‌న్ తో ఉన్న సాన్నిహిత్యం కార‌ణంగా జ‌న‌సేన లో చేరుతార‌ని జోర‌గా ప్ర‌చారం సాగింది. అయితే, మంత్రి గంటా తో భేటీ త‌రువాత టిడిపిలో చేరిక ఖాయ‌మ‌ని భావించారు. ఇప్పుడు స‌డ‌న్ గా ఆయ‌న వైసిపి లో చేరాల‌ని నిర్ణ‌యించారు. అందులో భాగంగా ఈ రోజు జ‌గ‌న్ కాకినాడ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లేముందు వైసిపి లో చేర‌నున్నారు. ఆయ‌న విజ‌య‌వాడ న‌గ‌రంలోని ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం కోరుతున్న ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే అక్క‌డ వైసిపి స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా వెల్లంప‌ల్లి శ్రీనివాస్ ఉన్నారు. టిడిపి నుండి జ‌లీల్ ఖాన్ కుమార్తెకు టిడిపి సీటు ఖ‌రారు చేసింది. దీంతో..అలీని అధికారికంగా పార్టీ అభ్య‌ర్దిగా ఎక్క‌డి నుండి బ‌రిలోకి దించుతార‌నే ది వేచి చూడాల్సిందే..

మాగంటి రాక ఖ‌రారు..!

మాగంటి రాక ఖ‌రారు..!

ఇక‌, సీనియ‌ర్ నేత ప్ర‌స్తుత టిడిపి ఎమ్మెల్సీ మాగంట శ్రీనివాసులు రెడ్డి వైసిపి లో చేర‌టం ఖాయ‌మైంది. కొద్ది రోజులుగా ఆయ‌న టిడిపిలో కొన‌సాగుతారా..వైసిపి లోకి వెళ్తారా అనే మీమాంస ఉంది. ఇదే స‌మ‌యంలో ఆయ‌న స‌డ‌న్ గా ప‌వ‌న్ తో భేటీ అయ్యారు. జ‌న‌సేన వైపు చూస్తున్నారా అనే ప్ర‌చారం జ‌రిగింది. ఇక‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తో భేటీ స‌మ‌యంలోనూ తాను ఒంగోలు ఎంపీగా పోటీ చేయ‌లేన‌ని స్ప‌ష్టం చేసారు. ఇక‌, ఎన్నిక‌ల షెడ్యూల్ రావ‌టంతో పార్టీలో కి వ‌చ్చేదీ రానిదీ స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని వైసిపి నేత‌లు కోరారు. దీని పై స‌న్నిహితుల‌తో చ‌ర్చించిన మాగుంట ఎట్ట‌కేల‌కు వైసిపి లో చేరాల‌ని నిర్ణ‌యించారు. ఆయ‌న నెల్లూరు లోక్‌స‌భ స్థానం నుండి పోటీ చేయ‌నున్నారు. నెల్లూరు ఎంపీగా ఉన్న మేక‌పాటి రాజ‌మోహ‌న రెడ్డి ఒంగోలు ఎంపీగా బ‌రిలో నిల‌వ‌నున్నారు.

అభ్య‌ర్ధుల జాబితా..బ‌స్సు యాత్ర‌

అభ్య‌ర్ధుల జాబితా..బ‌స్సు యాత్ర‌

ఇక‌, పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా వైసిపి అధినేత జ‌గ‌న్ ఈ నెల 12న పార్టీ అభ్య‌ర్దుల తొలి జాబితా విడుద‌ల చేయనున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే బ‌రిలో నిలిచే అభ్య‌ర్ధుల‌కు అన‌ధికారికంగా ప‌ని చేసుకోవాలంటూ స‌మాచారం ఇచ్చారు. టిడిపి జాబితా విడుద‌ల అయిన త‌రువాత వైసిపి జాబితా విడుద‌ల చేయాల‌ని భావించారు. అయితే,పార్టీ అవిర్భావ దినోత్స‌వం నాడు కొంత మంది తో తొలి జాబితా విడుద‌ల చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. అదే విధంగా పార్టీ లో చేరిక‌లు పూర్తి చేసుకొని..ఈ నెల 15 నుండి బ‌స్సు యాత్ర‌కు జ‌గ‌న్ సిద్దం అవుతున్నారు. పాద‌యాత్ర లో వెళ్ల‌ని నియో జ‌క‌వ‌ర్గాల్లో జ‌గ‌న్ యాత్ర కొన‌సాగ‌నుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+