ఎన్నికలపైన క్లారిటీ - పార్టీలో కొత్త కమిటీలు : నేటి నుంచి వైసీపీ ప్లీనరీ..!!

వైసీపీ ప్లీనరీకి సర్వం సిద్దమైంది. ముఖ్యమంత్రి జగన్ ఇడుపులపాయలో తన తండ్రికి నివాళి అర్పించిన తరువాత కడప నుంచి నేరుగా ప్లీనరీకి హాజరవుతారు. ఈ రోజు రేపు రెండు రోజుల పాటు ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయింది. అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వహిస్తున్న తొలి ప్లీనరీ. 2017లో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశంలోనూ ఇప్పుడూ జరుగుతోంది. వైఎస్సార్ కు నివాళి.. సర్వమత ప్రార్ధనలు..సీఎం జగన్ ప్రారంభోపన్యాసంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. తొలి రోజు లక్ష నుంచి లక్షాన్నార వరకు హాజరవుతారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇడుపుల పాయ నుంచి జగన్ తో పాటుగా విజయమ్మ కూడా ప్లీనరీకి వస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తం 10 తీర్మానాల పైన చర్చ - ఆమోదం ఉండనున్నాయి.

ఎన్నికలు - పార్టీ కమిటీలపై సీఎం ప్రకటన

ఎన్నికలు - పార్టీ కమిటీలపై సీఎం ప్రకటన


రెండో రోజు సీఎం జగన్ ముగింపు ప్రసంగంలో కీలక నిర్ణయాలను వెల్లడించనున్నారు. ఏపీ ఎన్నికల నిర్వహణ పైన క్లారిటీ ఇవ్వటంతో పాటుగా.. పార్టీ పరంగా ఎన్నికలకు రూట్ మ్యాప్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా.. క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సీఎం ప్లీనరీ వేదికగా కొత్త కమిటీల ఏర్పాటు పైన నిర్ణయం ప్రకటించనున్నారు. ఇక, సీఎం జగన్ వైసీపీ శాశ్వతాధ్యక్షుడిగా కొనసాగే విధంగా పార్టీ బైలాస్ లో మార్పులు చేసేందుకు నిర్ణయం జరిగింది. దీనికి సంబంధించి పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి తొలి రోజున ప్రతిపాదన చేస్తారు. రెండో రోజున ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించనుంది. అయితే, గౌరవాధ్యక్షురాలి పదవి కొనసాగింపు పైనా అనేక రకాలుగా ప్రచారం సాగుతోంది.

విజయమ్మ ప్రసంగం పైన ఆసక్తి

విజయమ్మ ప్రసంగం పైన ఆసక్తి


కానీ, పార్టీ ముఖ్య నేతలు మాత్రం పార్టీ అధ్యక్ష పదవి శాశ్వతంగా మార్చుతూ తీసుకొనే నిర్ణయంలో..గౌరవాధ్యక్షురాలి పదవి సైతం శాశ్వతం కానుందని చెబుతున్నారు. రెండో రోజు సీఎం జగన్ చేయబోయే ప్రసంగంలోని ఆంశాల పైన ఆసక్తి నెలకొని ఉంది. 2017లో ఇదే ప్రాంతంలో జరిగిన ప్లీనరీలో జగన్ తన పాదయాత్ర తో పాటుగా నవరత్నాలను ప్రకటించారు. ఇక, ఈ వేదిక ద్వారా వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా తన యాక్షన్ ప్లాన్ పైన క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రేపు ప్లీనరీ వేదికగా విజయమ్మ ప్రసంగం ఉండనుంది. ఇక, ఇప్పటికే ప్లీనరీకి వచ్చే వారికి సంబంధించి ఏర్పాట్ల కోసం మంత్రుల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కమిటీలు వేసారు. ప్రతీ నియోజకవర్గం నుంచి పదవుల్లో పార్టీ నేతలంతా హాజరు కానున్నారు. ప్లీనరీకి ఆహ్వానిస్తూ సీఎం పంపిన లేఖలను అందించారు.

10 తీర్మానాలు - కీలక నిర్ణయాల దిశగా

10 తీర్మానాలు - కీలక నిర్ణయాల దిశగా

దాదాపుగా ఈ రెండు రోజుల్లో నాలుగు లక్షల మంది వరకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. తొలి రోజున అయిదు తీర్మానాలు చేయనున్నారు. ఇక, సభకు హాజరయ్యే వారి కోసం ప్రత్యేకంగా వంటకాలు సిద్దం చేస్తున్నారు. ఇందుకోసం తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామం నుంచి ప్రత్యేకంగా వంటలు చేసే వారిని రప్పించారు. ఇక, దాదాపుగా గంటన్నార సేపు సీఎం జగన్ ముగింపు ప్రసంగం ఉంటుందని తెలుస్తోంది. ఈ స్పీచ్ లో జగన్ ఏం చెబుతారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. వచ్చే ఎన్నికల పైన ఈ ప్రసంగంలో క్లారిటీ ఇవ్వనున్నారు. అదే విధంగా తిరిగి అధికారం దక్కించుకొనే విధంగా రూట్ మ్యాప్ ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్న సమయంలో వైసీపీ ప్లీనరీ పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+