నటి నీతూ అగర్వాల్: బయటకొచ్చాక కొత్త ఆరోపణలు?
కర్నూలు: ఎర్ర చందనం కేసులో అరెస్టై బుధవారం నాడు జైలు నుండి విడుదలైన నీతూ అగర్వాల్ ఇంటర్వ్యూ కోసం డబ్పులు వసూలు చేసినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి! ఆ డబ్బులు ఆమె వసూలు చేయలేదని తెలుస్తోంది.
నీతూ అగర్వాల్ ఇంటర్వ్యూ కోసం ఆమె మేనేజర్ డబ్బులు వసూలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమె విడుదలయ్యాక ఇంటర్వ్యూ కోసం మీడియా ఎదురు చూడటం సహజమే. ఈ నేపథ్యంలో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

కాగా, ఎర్రచందనం అక్రమ రవాణాలో ప్రయేయముందన్న కారణంగా అరెస్టైన టాలీవుడ్ హీరోయిన్ నీతూ అగర్వాల్‌ను బుధవారం ఉదయం జైలు నుంచి విడుదల చేశారు. బెయిల్ కోసం ఆమె దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కర్నాలు ఆళ్లగడ్డ కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
షరతులతో కూడిన బెయిల్‌ను మంగళవారం మంజూరు చేసింది. దీంతో కోర్టు పేపర్లు అందుకున్న నంద్యాల సబ్ జైలు అధికారులు బుధవారం ఉదయం 6 గంటలకు ఆమెను విడుదల చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, చాగలమర్రి ఎంపీపీ మస్తాన్ వలిని పెళ్లి చేసుకున్న నీతూ అగర్వాల్ ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications