చంద్రబాబు మాట అంటే లెక్కలేదా, ఏం చేస్తున్నారో తెలుసా !!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలను ఆయన సొంత పార్టీ నాయకులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సొంత ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఆయన ఆదేశాలను కూటమి ప్రభుత్వంలోని నాయకులు పట్టించుకోవడం లేదని, వారికి తోడు వైసీపీ నాయకులు చంద్రబాబు ప్రభుతం ఆదేశాలను పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక ఇస్తామని చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్రజలకు హామీ ఇచ్చారు. చంద్రబాబు చెప్పినట్లుగానే ప్రస్తుతం ఉచిత ఇసుక సొంత అవసరాల కోసం ఇస్తున్నారు. సొంత అవసరాల కోసం ఎడ్లబండి, ట్రాక్టర్లలో ఇసుక తీసుకువెళ్లాలని, ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవలే చెప్పారు.

అయితే చంద్రబాబునాయుడు ఆదేశాలను పక్కనపెట్టిన తిరుపతి జిల్లాలోని నాయకులు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఏర్పేడు మండలంలో ఇసుక బకాసురులు పుట్టుకొస్తున్నారని, నదిలో అక్రమంగా ఇసుక బయటకు తీసి తిరుపతి నగరానికి తరలిస్తున్నారని వెలుగు చూసింది. కొత్తవీరాపురం సమీపంలోని నదిలో హిటాచి వాహనాలతో నదిలో నుండి ఇసుక బయటకు తీసి అనేక వాహనాల్లో సొంత భూముల్లోకి ఇసుక తరలింస్తున్నారు.
సొంత భూములలో ఇసుక నిల్వ చేస్తున్నారని, ఆ తర్వాత అక్కడి నుండి తిరుపతి నగరానికి తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రోక్లేయిన్ తో నదిలో నుంచి ఇసుక బయటకు తీసి ట్రాక్టర్లలో నింపి వారి సొంత భూముల్లోనే ఇసుక నిల్వ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ శాఖ అధికారులు కాని, స్థానిక నాయకులు కాని ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక వ్యాపారం చేసిన నాయకులు కొందరు ఇప్పుడు కూడా అదే ఇసుక వ్యాపారం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. స్థానిక ఇసుక వ్యాపారులు, వైసీపీ నాయకులు కలిసి వారి సొంత వాహనాలతోనే అక్రమంగా ఇసుక బయటకు తీసి ఇతర ప్రాంతాలకు ఇసుక తరలిస్తున్నారని వెలుగు చూసింది. ఇంత జరుగుతున్నా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారని, టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలను స్థానిక నాయకులు పట్టించుకోవడంలేదని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications