పుష్ప-2కు బంపర్ బోనాంజా ఇచ్చిన పవన్ కల్యాణ్
అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమా టికెట్ల రేట్లను పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సీగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన జీవోను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. డిసెంబర్ 4న ప్రీమియర్ల టికెట్ల ధరలను రూ. 800 రూపాయిలుగా నిర్ణయించింది. అయితే ఈ ధరలకు జీఎస్టీ కూడా యాడ్ అవుతుందని తెలిపింది.ఇక డిసెంబర్ 5వ తేదీ నుంచి రూ.100 నుంచి రూ. 200 వరకు పెంచుకునే అవకాశం కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
డిసెంబర్ 17 తేదీ వరకు టికెట్ల రేట్లు పెంచుతున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా పుష్ప-2 సినిమా టికెట్ల రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న రాత్రి 9:30, అర్థరాత్రి ఒంటి గంటకు, బెనిఫిట్ షోలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటి ధరలను సింగిల్ స్క్రీన్ , మల్టీప్లెక్సీలో రూ.800లుగా ఖారారు చేసింది. ఇక డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్ రూ.150,మల్టీప్లెక్సీ రూ.200 చొప్పున పెంచుకునే అవకాశం కల్పించింది.

డిసెంబర్ 9 నుంచి 16 వరకుసింగిల్ స్క్రీన్‌లకు రూ.105 రూపాయిలు, మల్టీప్లెక్సీలకు రూ.150 చొప్పున పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే టికెట్ల రేట్ల పెంపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టికెట్ల ధరపై 100, 150 రూపాయిలు పెంచడం అంటే సామాన్యుడికి సినిమాను దూరం చేయడమే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమా విడుదలైన 10 రోజుల వరకు టికెట్ల పెంపు ఉండటంలో సినీ అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. త్వరలోనే ఏపీ ప్రభుత్వం కూడా ఈ సినిమా టికెట్ల రేట్లను పెంచే అవకాశం ఉంది. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.












Click it and Unblock the Notifications