శ్రీతేజ్ కోసం అల్లు అర్జున్ రూ.2 కోట్లు - "భవిష్యత్" బాధ్యత..!!
అల్లు అర్జున్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంధ్య థియేటర్ ఘటనలో ప్రాణాపాయ స్థితికి చేరి ప్రస్తుతం కోలుకుంటున్న శ్రీతేజ్ భవిష్యత్ కు అండగా నిలవాలని నిర్ణయించారు. ఇందు కోసం శ్రీతేజ్ చదువు, భవిష్యత్ అవసరాలకు వీలుగా ఒక ట్రస్టు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందు కోసం రూ కోట్లు కేటాయించాలని డిసైడ్ అయ్యారు. అల్లు అర్జున్, సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి ఈ బాధ్యత తీసుకుంటున్నారు. ఈ మేరకు శ్రీతేజ్ కుటుంబ సభ్యులను కలిసి అంగీకార పత్రం ఇవ్వాలని నిర్ణయించారు.
అల్లు అర్జున్ నిర్ణయం
పుష్ప -2 ప్రీమియర్ షో వేళ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే మరణించిన రేవతి కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్రేతేజ్ ఆరోగ్యం కొంత మెరుగు అవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ సమయంలోనే ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ అయిన అల్లు అర్జున్ బెయిల్ పైన బయటకు వచ్చారు. అసెంబ్లీలో ఈ ఘటనకు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ వెల్లడించిన అంశాలు సంచలనంగా మారాయి. దీనికి ప్రతిగా అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేయటం ఇప్పుడు వివాదంగా మారింది.

శ్రీతేజ్ కోసం రూ 2 కోట్లు
దీని పైన స్పందించిన పోలీసులు ప్రీమియర్ షో రోజు ఏం జరిగిందో వీడియోల తో సహా వివరిం చారు. బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారంటూ బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో పిటీషన్ దాఖలుకు సిద్దమయ్యారు. ఇటు అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి అండగా నిలుస్తామని ఇప్పటికే ప్రకటించారు. శ్రీతేజ్ ఆరోగ్యం, భవిష్యత్ బాధ్యతలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. న్యాయ పరమైన సమస్యల కారణంగా తాను శ్రీతేజ్ ను పరామర్శించ లేదని వెల్లడించారు. అల్లు అరవింద్ ఆస్పత్రిలో శ్రీతేజ్ ను పరామర్శించారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కుమారుడు పేరు పైన ఏర్పాటు చేసిన ట్రస్టు నుంచి రూ 25 లక్షలు శ్రీతేజ్ తండ్రికి అందించారు. చికిత్స ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.
సుకుమార్ - మైత్రీతో కలిసి
ఇక, ఇప్పుడు అల్లు అర్జున్ శ్రీతేజ్ కోసం అల్లుఅర్జున్ ఓ ట్రస్టు ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్, సుకుమార్, మైత్రి మూవీమేకర్స్ కలిసి దాదాపు రూ.2కోట్ల తో నిధి ఏర్పాటు చేసి ఈ ట్రస్టు ద్వారా శ్రీతేజ్ వైద్యం, చదువు,చ భవిష్యత్తు కోసం ఖర్చు చేయాల నే నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు బాధిత కుటుంబాన్ని కలిసి అంగీకార పత్రం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. శ్రీతేజ్ కుటుంబానికి రూ 20 కోట్లు పరిహారం గా చెల్లించాలని ఇప్పటికే మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేసారు. అయితే, ఇప్పుడు ఈ రూ 2 కోట్ల తో ట్రస్టు ఏర్పాటు.. సాయం పైన అల్లు అర్జున్ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications