Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమరావతిలో 200 కోట్లతో 4 స్టార్ హోటల్..! 400 ఉద్యోగాలు..!

ఏపీ రాజధాని అమరావతికి కూటమి ప్రభుత్వం ఇవాళ మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాజధానిలో ఇప్పటికే పలు కార్పోరేట్ సంస్థలు, కన్వెన్షన్ సెంటర్లకు అనుమతి ఇస్తున్న ప్రభుత్వం ఇవాళ ఓ కార్పోరేట్ హోటల్ కు అనుమతి మంజూరు చేసింది. దాదాపు 200 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించే ఓ ఫోర్ స్టార్ హోటల్ కు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో అమరావతితో పాటు చుట్టు పక్కల ప్రాంతాల వారికి 400 ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.

ప్రస్తుతం హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని విశాఖలో హోటల్స్ నడుపుతున్న దసపల్లా గ్రూపుకు అమరావతిలో 4 స్టార్ హోటల్ నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అలాగే ఈ హోటల్ కు ఇతర సంస్థల మాదిరిగానే పలు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వబోతోంది. ఇందులో పన్నులు, విద్యుత్ ఛార్జీలతో పాటు పలు మినహాయింపులు ఉన్నాయి. రాష్ట్ర పర్యాటక విధానం ప్రకారం ఈ అనుమతులు ఇచ్చారు.

Amaravati to Get 4-Star Dasapalla Hotel AP Govt Approves 200 Cr Project 400 New Jobs

దసపల్లా గ్రూపు అమరావతిలో ఫోర్ స్టార్ హోటల్ నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చింది. దీంతో వీటిని రాష్ట్ర పర్యాటక విధానం కింద ప్రోత్సాహకాలు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా పదేళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులతో పాటు స్టాంప్ డ్యూటీ వందశాతం తిరిగి చెల్లించాలని నిర్ణయించారు. అలాగే పరిశ్రమల తరహాలో విద్యుత్ చార్జీలు వసూలు, ఐదేళ్లకు విద్యుత్ సుంకం తిరిగి చెల్లింపుకు నిర్ణయ్ంచారు. ఈ మేరకు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజైయ్ జైన్ పేరిట ఆదేశాలు వెలువడ్డాయి.

Amaravati to Get 4-Star Dasapalla Hotel AP Govt Approves 200 Cr Project 400 New Jobs

అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా ఇక్కడికి వచ్చే సంస్ధలకు ప్రభుత్వం వివిధ రూపాల్లో రాయితీలు ఇస్తోంది. వీటిని దసపల్లా హోటల్ కు కూడా వర్తింపచేశారు. దసపల్లా హోటల్ నిర్మాణం జరిగితే ఇతర కార్పోరేట్ హోటల్ గ్రూప్స్ కూడా ఇక్కడికి తరలివచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+