అంబటి సంచలనం...పోలింగ్ రోజు దాడులు చేసింది టీడీపీ నేతలే

ఎన్నికల సమరం ముగిసింది. ఇక ఫలితాలకు మే 23 వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపధ్యంలో పోలింగ్ పై, పోలింగ్ రోజు జరిగిన దాడులపై రాజకీయ నేతలు ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుతున్నారు. ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసింది అని చంద్రబాబు అంటుంటే టీడీపీ నేతలే దాడులు చేశారని, ఓటమిభాయంతోనే చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని వైసీపీ నేతలు అంటున్నారు.

దాడులు చేసింది టీడీపీ నేతలే అంటున్న అంబటి

దాడులు చేసింది టీడీపీ నేతలే అంటున్న అంబటి

ఇటీవల జరిగినటువంటి ఏపీ ఎన్నికల్లో దాడులు జరిపింది మొత్తం టీడీపీ నేతలే అని వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుసంచలన వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ రోజు కోడెల శివ ప్రసాద్ పోలింగ్ సెంటర్ లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారని, ఆయన తీరును నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారని అంబటి రాంబాబు పేర్కొన్నారు .

వైసీపీ కార్యకర్తలపై జరిగిన దాడులపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన అంబటి

వైసీపీ కార్యకర్తలపై జరిగిన దాడులపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన అంబటి

పోలింగ్ జరిగిన రోజున వైసీపీ కార్యకర్తలపై జరిగిన దాడులపై గుంటూరు జిల్లా ఎస్పీకి ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత మీడియా తో మాట్లాడిన అంబటి, ఎలాంటి విచారణ జరపకుండానే ఇనుమెట్ల ఘటనపై తమపై తప్పుడు కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు .పోలీసులు విచారణ జరపకుండా ఏకపక్షంగా ఎలా వ్యవహరిస్తారని ఆయన అన్నారు.

అధికార పార్టీకి మద్దతుగా పోలీసులు వ్యవహరించారని ఆరోపణ

అధికార పార్టీకి మద్దతుగా పోలీసులు వ్యవహరించారని ఆరోపణ

పోలింగ్ రోజు పోలీసులు కూడా అధికార పార్టీ కి మద్దతుగా నిలిచారని, పోలింగ్ రోజున గురజాలలో అధికారపార్టీకి మద్దతుగా పోలీసులు వ్యవహరించారని ఆయన ఆరోపించారు. ఈ సంఘటన మీద విచారణ జరపాలని రూరల్ ఎస్సీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. పోలింగ్ రోజున ఇంతటి అరాచకాలు సృష్టించినటువంటి టీడీపీ నేతలకు శిక్ష తప్పదని అంబటి వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+