Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సంచలనం సృష్టించిన రేప్ కేసు;పోలీసుల అదుపులో నిందితులు!...అనంతపురమా?...

అనంతపురం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆత్మకూరు మండలం పంపనూరు కొండల్లో విద్యార్థిని రేప్ కేసులో అసలు నిందితులైన ఇద్దరు యువకులను అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. పంపనూరు కొండల్లో ఓ ప్రేమ జంటపై దాడి చేయటంతో పాటు...ఆ జంటలోని యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులది అనంతపురమేనని పోలీసులు సమాచారం రాబట్టినట్లు తెలిసింది.

విద్యార్థులైన ప్రేమ జంటపై నిందితుల పైశాచికత్వాన్ని ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ చాలా తీవ్రంగా పరిగణించారు. ఎస్పీ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో...ఆయన ఆదేశాల మేరకు డీఎస్పీ వెంకట్రావ్‌ ఆధ్వర్యంలో ఆత్మకూరు సీఐ శివనారాయణస్వామి, ఇద్దరు ఎస్‌ఐలతో ఈ రేప్ కేస్ నిందితుల కోసం ముమ్మరంగా వేట సాగించి, చివరకు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకోవడంలో సఫలమైనట్లు తెలుస్తోంది.

పోలీసుల అదుపులో...నిందితులు...

పోలీసుల అదుపులో...నిందితులు...

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడింది 30 నుంచి 35 ఏళ్ల లోపు వయసున్నఇద్దరు నిందితులని, వీరిది అనంతపురమని తెలుసుకున్న పోలీసులు అనంతరం వారిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. వీరిని జిల్లా కేంద్రంలోని ఓ రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నట్లు, ఆ విచారణలో వీరుకు ముందు నుంచి నేరచరిత్ర ఉన్నట్లు పోలీసులకు బహిర్గతమైనట్లు సమాచారం.

కీలక సమాచారం...రాబడుతున్నారు...

కీలక సమాచారం...రాబడుతున్నారు...

వీరి నుంచి కీలక సమాచారం రాబట్టాక రెండు, మూడు రోజుల్లో వీరి అరెస్ట్ చూపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది...విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అసలు రేప్ జరిగిన రోజు ఏం జరిగిందంటే...జనవరి 28న అనంతపురం నగరంలో చదువుకుంటూ ప్రేమలో పడిన ఇద్దరు స్టూడెంట్స్ ఆదివారం నాడు పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వ రస్వామి గుడికి వెళ్లారు. అనంతపురం నుంచి ప్రతి ఆదివారం పెద్ద సంఖ్యలో ఇలా మహిళలు,విద్యార్థులు పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వ రస్వామి దర్శనానికి రావడం నిందితులు గమనించారు.

దారుణం...పైశాచిక ఆనందం

దారుణం...పైశాచిక ఆనందం

అదేరీతిన పంపనూరు వచ్చిన ఆ ప్రేమజంట స్వామి దర్శనానంతరం సమీపంలోని నిర్జనప్రాంతంలోకి వెళ్లి కబుర్లు చెప్పుకుంటున్నారు. వారిని అనుసరిస్తూ వచ్చిన ఇద్దరు నిందితులు అక్కడ కూర్చున్న ఆ ప్రేమజంట వద్దకెళ్లి, తాము పోలీసులమంటూ బెదిరించి...ఇక్కడ మీకేం పనంటూ బెదిరించి...ఆ యువకుడి చేతులు కట్టేసి, అతడి ఎదుటే యువతిపై అత్యాచారం చేశారు. విషయం బయటకు చెబితే ఫొటోలను నెట్లో పెడతామని బెదిరించారు.

తల్లిదండ్రుల అండతో...పోలీసులకు ఫిర్యాదు...

తల్లిదండ్రుల అండతో...పోలీసులకు ఫిర్యాదు...

దీంతో జరిగిన ఘటనతో బాధిత యువతి తీవ్ర మానసిక క్షోభకు లోనైంది. అయితే పరువు గురించి ఆలోచించి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు భయపడిపో యింది. అయితే కుమార్తె మనోవేదనకు లోనవడం గుర్తించిన తల్లిదండ్రులు ఓదార్చి, అసలు విషయం తెలుసుకున్నారు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మూడురోజుల క్రితం ఈ ఫిర్యాదు అందుకున్న ఎస్పీ, ఈ అత్యాచారాన్ని సీరియస్‌గా తీసుకోవటంతో దర్యాప్తు బృందం విచారణను వేగ వంతం చేసిం నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే పోలీసులు మాత్రం ఇంకా నిందితులను పట్టుకోవాల్సి ఉందని చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+