నడి సంద్రంలో ఆగిపోయిన అండమాన్ నౌక: ఏపీ ప్రయాణికుల ఆందోళన
విశాఖపట్నం: నగర తీరం నుంచి మంగళవారం బయల్దేరిన అండమాన్ నౌక్ 'హర్షవర్ధన్’ నడి సముద్రంలో నిలిచిపోయింది. నౌకలో 600మంది ప్రయాణికులు ఉండగా, ఇందులో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారే ఉన్నారు.
సాంకేతిక లోపం కారణంగానే నౌక నడి సముద్రంలో ఆగిపోయినట్లు తెలుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం 1.20గంటలకు ప్రయాణికులతో విశాఖ తీరం నుంచి బయల్దేరిన నౌక.. సాంకేతిక లోపం కారణంగా నడి సముద్రంలో నిలిచిపోయింది.

అల్ప పీడన ప్రభావంతో సముద్రం అలజడిగా ఉండటంతో నౌకలోని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమాచారం తెలిసిన ప్రయాణికుల బంధువులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, విశాఖ నుంచి 6గంటల ప్రయాణం చేసిన అనంతరం నిలిచిపోయినట్లు తెలిసింది. కాగా, 50ఏళ్లుగా ఈ నౌక అండమాన్-విశాఖ తీరాల మధ్య రవాణా సాగిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై అధికారులు స్పందించి మళ్లీ విశాఖ తీరానికి నౌకను తీసుకువచ్చే అవకాశం ఉంది.
స్పందించిన నేవీ అధికారులు
నౌకలోని సమస్య పరిష్కారానికి మరో 6 నుంచి 7 గంటల సమయం పడుతుందని మర్చంట్ నేవీ అధికారులు వెల్లడించారు. ఉపాధి కోసం ఉత్తరాంధ్ర కూలీలు విశాఖ పోర్టు నుంచి నౌక ప్రయాణం ద్వారా అండమాన్ వెళ్తుంటారు. మంగళవారం కూడా అలా వెళ్తుండగానే ఈ ఘటన జరిగింది. నౌక మరమ్మతులు పూర్తయిన తర్వాత కూలీలను తిరిగి విశాఖ తీసుకు రావాలా లేక అదే నౌకలో అండమాన్ పంపాలా అనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని నేవీ అధికారులు చెప్పారు.
నౌకలోని ప్రయాణికులందరికీ ఆహార పదార్థాలు అందజేసినట్లు పోర్ట్ ఛైర్మన్ జేసీ తెలిపారు. మరో రెండు మూడు గంటల్లో నౌక మరమ్మతులు చేసి అండమాన్ కు తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications