ఏపీ దశ దిశ మార్చే లా - చంద్రబాబు వినూత్న ఆలోచన..!!

ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం చంద్రబాబు కొత్త సంకల్పం తీసుకున్నారు. ఇందు కోసం స్వర్ణాంధ్ర విజన్ -2047 డాక్యెమెంట్ ను ప్రకటించారు. పేదరికం లేని సమాజం, ప్రతి కుటుంబానికి అవసరమైన వనరులు సమకూర్చడం, ఎదిగేందుకు అవకాశా లు కల్పించడమే లక్ష్యంగా ఈ విజన్ ఆవిష్కరించారు. ఉద్యోగ, ఉపాధి కల్పనతోపాటు రైతుల ఆదాయాన్ని పెంచుతూ.. మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేసేలా స్వర్ణాంధ్ర విజన్ రూపొందిం చారు. కేంద్రంలో ప్రధాని మోదీ వికసిత్ భారత్ 2047 కి అనుగుణంగా చంద్రబాబు తన విజన్ ను స్పష్టమైన లక్ష్యాలతో ప్రకటించారు.

నెంబర్ ఒన్ గా ఏపీ
అంతరాలు లేని సమాజం ఆవిష్కరణ తో పాటుగా ఆరోగ్యం - ఆనందం అందించేలా చంద్రబాబు తన విజన్ ను ఆవిష్కరించారు. పేదరికం లేని సమాజం, ప్రతి కుటుంబానికి అవసరమైన వనరు లు సమకూర్చడం, ఎదిగేందుకు అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పది సూత్రాలతో ఈ విజన్ రూపొందించారు. 2047 విజన్ లో ప్రధానంగా సమయం ఉన్నప్పుడు పని చేయటం.. అవసరం ఉన్న సమయంలో పని చేయించుకోవటం విధానంగా తీర్చి దిద్దారు. డిజిటల్ లెర్నింగ్ కు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అదే విధంగా టెలీమెడిసన్ సౌకర్యాలు.. అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేలా విజన్ ను సిద్దం చేసారు.

Andhra Pradesh 2047 Chandrababus Vision for Sustainable Development

అన్ని రంగాల్లోనూ అగ్రపథాన
స్థానిక సంప్రదాయాలు, సంస్కృతిని పరిరక్షిస్తూనే... ఆర్థిక కార్యకలాపాలు చేపడతారు. ప్రతీ ఇంటి కి మేలు జరిగే ఈ విజన్ లో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించారు. పేదరికం లేని సమాజం కోసం కుటుంబం యూనిట్‌గా ఇంటి స్థలం, మంచి నీరు, 24 గంటల విద్యుత్, వంటగ్యాస్, మరుగు దొడ్లు, మురుగునీటి పారుదల సౌకర్యం, సోలార్‌ రూఫ్‌టాప్, డిజిటల్‌ కనెక్టివిటీ, రాయితీపై సౌర విద్యుత్తు వంటి అనేక సౌకర్యాలు కల్పించేలా ప్రతిపాదనలు చేసారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు చేయాలనేది మరో ప్రధాన లక్ష్యం. ప్రతీ కుటుంబానికి సామాజిక భద్రత తో పాటు సంక్షేమ పథకాలు, అందరికీ ఆరోగ్యం, విద్య, స్కిల్, మౌలిక సౌకర్యాలు, విస్తృత ఆరోగ్యసేవలు, బీమా సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.

మహిళల కోసం
మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చి దిద్దే ఆలోచనలకు విజన్ 2047 లో ప్రాధాన్యత ఇచ్చారు. అందులో భాగంగా మహిళలకు ఇంటి నుంచే పనిచేసుకుని ఆదాయం పొందే విధానం అందు బాటు లోకి తీసుకురానున్నారు మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక మద్దతివ్వనున్నారు. మహిళా ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. సీనియర్‌ సిటిజన్స్‌కు పొదుపు సంఘాలు ఏర్పాటు చేస్తారు. పర్యాటక ఆదాయాన్ని 4 శాతం నుంచి 20 శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్ణ యించుకున్నారు. ఉపాధి, ఉద్యోగాలకు పారిశ్రామిక పార్కులు, టౌన్‌షిప్స్‌ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు ఆవిష్కరించారు.

వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత
వ్యవసాయ రంగానికి విజన్ - 2047 లో ప్రాధాన్యత ఇచ్చారు. రైతుకు వ్యవసాయంలో సాంకేతికతను ప్రోత్సహించనున్నారు. వ్యవసాయ ఖర్చులు తగ్గించటం లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా ప్రకృతి సేద్యం ద్వారా వ్యవసాయ ఖర్చుల తగ్గింపు వంటి వాటిని ప్రస్తావిం చారు. ఇదే సమయంలో భూమి సారం పెంపు, పంటల మార్పిడి, అధిక విలువ కలిగిన పంటల సాగు, ఆక్వా క్లస్టర్ల ఏర్పాటు గురించి ప్రస్తావించారు. ఇక, వ్యవసాయంలో సౌర విద్యుత్ వినియో గం, ఈ-ట్రాక్టర్ల వాడకం, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, ఐఓటీ, డ్రోన్లు, రోబోటిక్స్ వినియోగం పైన విజన్ ఆవిష్కరించారు. అదే విధంగా చీడపీడల గుర్తింపు, నియంత్రణకు ఉపగ్రహ సాంకేతికతకు ప్రాధాన్యమిస్తారు. ఆక్వాతో పాటు మామిడి, అరటి, మిరప, కాఫీ, పామోలిన్, సుగంధ ద్రవ్యాల పంటలకు స్పెషల్ హబ్‌లు ఏర్పాటు చేయనున్నారు.

అగ్ర స్థానమే లక్ష్యంగా
విజన్ -2047 లో అభివృద్ధికి పెద్దపీట వేసారు. అందులో భాగంగా కోల్‌కతా- చెన్నై రైలు మార్గంలో 2 లైన్లను 4 లైన్లు చేసే ప్రణాళిక సిద్దమైంది. రాష్ట్రాన్ని ఉత్పత్తి రంగ హబ్‌గా తయారు చేయనున్నారు. విశాఖపట్నంలో సివిల్‌ ఏవియేషన్‌ యూనివర్శిటీ ఏర్పాటు, విమానాల మరమ్మతుల సెంటర్ పెట్టనున్నట్లు విజన్ లో వెల్లడించారు. జలరవాణా పునరుద్ధరించేలా కొత్త ప్రణాళికలను ఆవిష్కరించనున్నారు. సమ్మిళిత వృద్ధి, పేదరికం లేని సమాజం అనేది మంత్రం గా ఈ విజన్ అసలు లక్ష్యం. గతంలో హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేటు భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలన చేయటం లక్ష్యంగా పేర్కొన్నారు. నైపుణ్యం, మానవవనరుల అభివృద్ధికి పెద్దపీట వేసేలా విజన్ ఆవిష్కరించిన చంద్రబాబు.. అక్షర క్రమంలోనే కాదు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పరంగానూ ఏపీ తొలి స్థానంలో నిలపటమే చంద్రబాబు విజన్ -2047 లక్ష్యంగా స్పష్టం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+