ఉద్యోగులు, జర్నలిస్టులు, రైతులకు శుభవార్త!: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీ కేబినెట్ సోమవారం భేటీ అయింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందించే అంశం, జర్నలిస్టులకు ఇల్లు, ఉద్యోగులకు గృహ వసతి, డ్వాక్రా మహిళలకు ఆర్థిక సాయం, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం తదితర అంశాలపై చర్చించారు.

andhra pradesh cabinet key decisions before elections

- ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ పెంపునకు కేబినెట్ ఓకే. 1.572 శాతం డీఏ విడుదలకు ఆమోదం పొందిందని తెలుస్తోంది.

- డ్వాక్రా సంఘాలకు ఒక్కొక్కరికి రూ.10వేలు పథకానికి ఆమోదం పొందిందని తెలుస్తోంది.
- 94 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ.9400 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయించారు.
- రైతులకు కొత్త పథకం అందుబాటులోకి తెచ్చే యోచనలో సర్కార్. తెలంగాణలో రైతు బంధు పథకం లాంటి దానిని తేవాలని యోచిస్తున్నారు. దానికి రైతు రక్ష అనే పేరు పెట్టే అవకాశాలు ఉన్నాయి.
- పింఛన్ల పెంపు నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
- అగ్రిగోల్డ్ పైన కీలక నిర్ణయం.
- చుక్కల భూముల సమస్యలపై మంత్రివర్గంలో చర్చ
- ఆటో, ట్రాక్టర్లకు ట్యాక్స్ మినహాయింపుపై చర్చిస్తుంది.
- సంక్షేమ పథకాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది.
- జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి 30 ఎకరాల భూమి కేటాయింపుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందని తెలుస్తోంది. రాజధానిలో నివాసం ఉండే ఉద్యోగులు, అధికారులు, జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణంపై కేబినెట్‌లో చర్చ జరిగింది.
- 2014 నుంచి అనుమతి లేకుండా నిర్మించిన 1.66 లక్షల పేదల ఇళ్లకు రూ. 756 కోట్లు చెల్లించాలని నిర్ణయం.
- డ్వాక్రా మహిళలకు సెల్‌ఫోన్లు ఇవ్వాలని నిర్ణయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+