2లక్షలకోట్లపై బాబు కన్ను, జగన్‌కి చురక(పిక్చర్స్)

విశాఖ: పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి 21 పని దినాల్లో అవసరమైన అనుమతులు మంజూరు చేసేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం సింగిల్ డెస్క్ విధానం2015ని ప్రకటించింది. ఈ మేరకు ఏపీ పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి ఎస్సెస్ రావత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అంతకుముందు బుధవారం విశాఖపట్నంలో చంద్రబాబు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల సమక్షంలో ఇండస్ట్రియల్ మిషన్ ఆవిష్కరించారు. పరిపాలనా రాజధానిగా అమరావతి, ఆర్థిక, ఐటీ రాజధానిగా విశాఖపట్నం, ఆధ్యాత్మిక రాజధానిగా తిరుపతి, నవ్యాంధ్రను అభివృద్ధికి నిలయంగా మారుస్తున్నామని, పెట్టుబడులతో రావాలని చంద్రబాబు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.

పుష్కలంగా కరెంటు, అందుబాటులో భూమి, కొరతలేని నీరు ఉన్నాయన్నారు. తాము ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాగా, చంద్రబాబు రానున్న ఐదేళ్లలో రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల పైన కన్నేశారు. మరోవైపు, తొలి రోజే ఏపీపై పెట్టుబడుల వర్షం కురిసింది. ఒకే వేదికపై 47 ఒప్పందాలు కుదిరాయి. 35వేల కోట్ల పెట్టుబడుల రాకకు మార్గం సుగమమైంది.

 చంద్రబాబు

చంద్రబాబు

ఇండస్ట్రియల్ మిషన్ ఆవిష్కరించిన రోజే, 47 పారిశ్రామిక ఒప్పందాలు, రూ.35 వేల కోట్ల పెట్టుబడులు, 70 వేల మందికిపైగా ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి.

 చంద్రబాబు

చంద్రబాబు

సీఎం సమక్షంలో రూ.35,745 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎంవోయూలు కుదుర్చుకున్నారు. వీటిద్వారా 72,210 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, పారిశ్రామిక వేత్తలకూ మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి.

 చంద్రబాబు

చంద్రబాబు

దరఖాస్తు చేసిన 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేందుకు సింగిల్‌ డెస్క్‌ విధానాన్ని అమల్లోకి తెస్తున్నామని చెబుతూ దానికి సంబంధించిన పోర్టల్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు. బయోటెక్నాలజీ, ఆటోమొబైల్‌ పాలసీలను ఆవిష్కరించారు.

 చంద్రబాబు

చంద్రబాబు


ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశే ఉత్తమమని చెప్పారు. 2029 నాటికి రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలుపుతామని పునరుద్ఘాటించారు.

 చంద్రబాబు

చంద్రబాబు

2020 నాటికి పది లక్షల ఉద్యోగావకాశాలు లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. ఏపీ కొత్తగా ఏర్పాటైన రాష్ట్రమని, అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని తొలి ఏడాది 8.4 శాతం అభివృద్ధి రేటు సాధించామని, దీన్ని రెండంకెలకు తీసుకువెళ్లేందుకు శ్రమిస్తున్నామని తెలిపారు.

 చంద్రబాబు

చంద్రబాబు

పరిశ్రమలకు అవసరమైన భూమి కోసం ల్యాండ్‌ పూలింగ్‌ విధానం చేపట్టామని, రైతులు ఇచ్చిన భూమిని అభివృద్ధి చేసి అందులో 20-25 శాతం తిరిగి వారికే కేటాయిస్తామని, ఇలా పరిశ్రమల కోసం పది లక్షల ఎకరాలతో ల్యాండ్‌ బ్యాంకు ఏర్పాటు చేస్తామన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

ఏ పరిశ్రమ కావాలన్నా, ప్రాజెక్టు రావాలన్నా భూమి అవసరమని, అవసరమైనంత ఇవ్వడానికి రైతులు ముందుకు రావాలని, అవసరమైతే త్యాగాలకు సిద్ధం కావాలన్నారు. ఏపీలో ప్రస్తుతం విద్యుత్‌ కోతలు లేవని, భవిష్యత్తులో ఉండబోవన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేస్తూ వేయి టీఎంసీల నీటిని అందుబాటులోకి తేనున్నామని ప్రకటించారు. పరిశ్రమలకు భూమి, విద్యుత్తు, నీరు ప్రధానమని, అందుకే వాటికి కొరత లేకుండా చేస్తున్నామని తెలిపారు. ప్రైవేటు సంస్థలతో కలిసి పని చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, జాయింట్‌ వెంచర్లతోపాటు పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)లోను ప్రాజెక్టులు చేపడతామని, ఔత్సాహికులు ముందుకు రావాలని, ఏపీ సహజ వనరుల కేంద్రమన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

బాక్సైట్‌, బొగ్గు, గ్రానైట్‌ గెలాక్సీ, బెరైటీస్‌, లైమ్‌స్టోన్‌, బీచ్‌శాండ్‌ తదితర వనరులు పరిశ్రమలకు ఉపయోగపడ తాయన్నారు. కేజీ బేసిన్‌లో 2018 నాటికి 250 లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ను ఓఎన్‌జీసీ వెలికి తీస్తుందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా బయో టెక్నాలజీ రంగం ప్రధానంగా ఔషధ తయారీలో ముందంజలో ఉందామన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులను అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. అమరావతి రాష్ట్ర రాజధానిగా ఉంటుందని, అక్కడ హైదరాబాద్‌ రింగ్‌ రోడ్డు కంటే పొడవుగా 225 కి.మీ. రింగ్‌ రోడ్డు నిర్మిస్తామన్నారు. విశాఖపట్నం రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా వర్ధిల్లుతుందని, ఆ దిశగా ఇక్కడ పరిశ్రమలను ప్రోత్సహిస్తామని తెలిపారు. ఐటీ హబ్‌గా, పర్యాటక కేంద్రంగా కూడా విశాఖ నిలుస్తుందన్నారు. తిరుపతిని ఆధ్యాత్మిక రాజధానిగా తీర్చిదిద్దుతామన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

రాష్ట్రంలో దాదాపు వేయి కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం ఉందని, ఈ చివర నుంచి ఆ చివరి వరకు రోడ్డు వేయాలన్నది తన ధ్యేయమని, ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు 2015-20 పాలసీని త్వరలో ప్రకటిస్తామన్నారు.ప్రైవేటు వర్సిటీల బిల్లును కూడా త్వరలోనే ప్రవేశపెడతామన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

ప్రభుత్వం ఎంతో సదుద్దేశంతో చేస్తున్న ప్రయత్నాలకు కొందరు అడ్డం పడుతున్నారని, పరిశ్రమలకు భూములు ఇవ్వవద్దని చెబుతున్నారని చంద్రబాబు పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి ఆరోపించారు. కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని, అది సరైన విధానం కాదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+