ఊపిరి పీల్చుకున్న ప్రముఖ హీరో అల్లు అర్జున్, ఆ రోజు వైసీపీకి !!
ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమాలు ఉల్లంఘించారని నమోదు అయిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో అల్లు అర్జున్ పై నవంబర్ 6వ తేదీ వరకు ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్, నంద్యాల మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి వేసిన వ్యాజ్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది.
తమ మీద నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని ప్రముఖ హీరో అల్లు అర్జున్, నంద్యాల వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. వీరిద్దరి మీద నంద్యాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎన్నికల నియమాలు ఉల్లంఘించారని అప్పట్లో కేసు నమోదు అయ్యింది. తమ మీద నమోదైన కేసులను కొట్టివేయాలని హీరో అల్లు అర్జున్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు.

వీరి పిటీషన్ విచారణ చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నవంబర్ 6వ తేదీ వరకు అల్లు అర్జున్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి పై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని, నవంబర్ 6వ తేదీన తగిన ఉత్తర్వులు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెలిపింది. కొన్ని నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాలలో వైసీపీ అభ్యర్థిగా రవిచంద్ర కిషోర్ రెడ్డి పోటీ చేశారు. ఆ సందర్భంలో స్నేహితుడు రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు తెలపడానికి హీరో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లారు.
అప్పట్లో హీరో అల్లు అర్జున్ నంద్యాల పర్యటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. అసెంబ్లీ ఎన్నికల నియమాలు అమలులో ఉన్నా వైసీపీ కార్యకర్తలు ఏమాత్రం పట్టించుకోలేదని, నంద్యాల పట్టణంలోకి అల్లు అర్జున్ ఎంట్రీ ఇవ్వకముందే వైసీపీ కార్యకర్తలు పట్టణ శివార్లలో నానా హంగామా చేశారని ఆరోపణలు ఉన్నాయి. నంద్యాల పట్టణ శివార్ల నుండి బైక్ ర్యాలీ, కార్ల ర్యాలీలతో హీరో అల్లు అర్జున్ ను వైసీపీ నాయకుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటి వరకు పిలుచుకుని వెళ్లారు.
ఆ సందర్భంలో అప్పటి ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నంద్యాల టూ టౌన్ పోలీసులు ప్రముఖ హీరో అల్లు అర్జున్ తో పాటు వైసీపీ నాయకుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి మీద కేసు నమోదు చేశారు. నంద్యాలలో తన మీద కేసులు కొట్టివేయాలని ప్రముఖ హీరో అల్లు అర్జున్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. జనసేన పార్టీకి మద్దతు తెలపకుండా వైసీపీకి మద్దతు ఇచ్చిన అల్లు అర్జున్ పై ఇప్పటికీ మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు..












Click it and Unblock the Notifications