ఏపీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా: ఇక వైఎస్ షర్మిల ఎంట్రీ!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా మరోకీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ పీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. వైఎస్ షర్మిల ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరగా.. ఆమెకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతున్న వేళ గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది.

 Andhra Pradesh pcc chief Gidugu Rudraraju resigns for his post

గిడుగు రుద్రరాజు సోమవారం తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. ఈ క్రమంలో, ఎల్లుండి లోపు ఏపీ కాంగ్రెస్ కొత్త చీఫ్ పేరును ఏఐసీసీ ప్రకటించే అవకాశాలున్నాయి. ఏపీ పీసీసీ చీఫ్ పదవిపై షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి హామీ లభించినట్టు తెలుస్తోంది.

కాగా, నవంబర్ 23, 2022న ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా ఏఐసీసీ గిడుగు రుద్రరాజు నియమింపబడ్డారు. గిడుగును అధ్యక్షుడిగా నియమించిన తరువాత ఆయన కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేశారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్‌ పార్టీ పదేళ్లయినా తిరిగి కోలుకోలేదు. కీలక నేతలంతా ఇతర పార్టీల్లోకి చేరిపోయారు.

ఈ నేపథ్యంలోనే ఏపీ కాంగ్రెస్‌కు దివంగత సీఎం వైయస్సార్ కుమార్తె అయిన వైఎస్ షర్మిల రాక కొత్త ఉత్సాహం తీసుకొచ్చింది. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె కావడం, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ సోదరి కావడంతో ఆమె చేరిక కాంగ్రెస్‌ పార్టీకి కలిసొచ్చే అంశమని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే వైసీపీని వీడిన పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతుండటం గమనార్హం. దీంతో కాంగ్రెస్‌కు పూర్వవైభవం వస్తుందని ఆ పార్టీ నేతలు ఆశిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+