రేవ్ పార్టీ కేసులో నటి హేమను వదిలేయండి, పదేపదే ఫోన్లు చేస్తున్న ఆంధ్రా పొలిటికల్ లీడర్స్ ?

బెంగళూరులో రేవ్ పార్టీలో పాల్గొన్న తెలుగు నటి హేమకు నోటీసులు జారీ చేసిన తర్వాత బెంగళూరు సీసీబీ పోలీసులకు ఫోన్లు చేసిన ఆంధ్రప్రదేశ్ లోని కొందరు రాజకీయ నాయకులు ఆమెను వదిలేయాలని ఒత్తిడి చేశారని వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ నాయకుల నుంచి వరుసగా కాల్స్ వస్తున్నాయని, నటి హేమను వదిలేయాలని మాపై ఒత్తిడి చేస్తున్నారని ఓ పోలీసు అధికారి కన్నడ మీడియాకు చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

బెంగళూరు నగర శివార్లలోని ఆనేకల్ తాలుకాలోని ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్, సెక్స్ దందా జరిగిందని ఆరోపిస్తూ పోలీసులు కేసులు నమోదు చేశారు. రేవ్‌ పార్టీలో తెలుగు నటి హేమ డ్రగ్స్‌ సేవించినట్లు వైద్య పరీక్షల్లో తేలిందని పోలీసు అధికారులు అంటున్నారు. దీంతో బెంగళూరు సీసీబీ పోలీసులు విచారణకు హాజరు కావాలని హేమకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. హేమకు నోటీసులు జారీ చేయడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు కొందరు బెంగళూరు సీసీబీ పోలీసులకు పదే పదే ఫోన్లు చేస్తున్నారని కన్నడ మీడియా అంటోంది.

Andhra Pradesh politicians pressuring Bengaluru police to release actress Hema in rave party case

అంతేకాకుండా హేమను అరెస్ట్ చేయవద్దని, ఆమెను విచారణ చేసి వదిలేయాలని బెంగళూరు సీసీబీ పోలీసుల మీద ఒత్తిడి చేస్తున్నారని కన్నడ మీడియా తెలిపింది. బెంగళూరు శివార్లలోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్న వారి రక్త నమూనాలు సేకరించిన బెంగళూరు సీసీబీ పోలీసులు వాటిని ల్యాబ్ కు పంపించారు. తెలుగు సినీ నటి హేమతో సహా 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించినట్లు బెంగళూరు సీసీబీ పోలీసు వర్గాలు తెలిపాయి.

వాసు బర్త్ డే పార్టీ పేరుతో ఏర్పాటు చేసిన ఈ రేవ్ పార్టీకి మొత్తం 103 మంది హాజరయ్యారని సమాచారం. రేవ్ పార్టీలో పాల్గొన్నవారిలో 73 మంది పురుషులు, 30 మంది మహిళలు ఉన్నారు. మే 19వ తేదీ తెల్లవారుజామున బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఫామ్‌హౌస్‌పై పోలీసులు దాడి చేసి రూ. 1.5 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు, ఇందులో MDMA (ఎక్‌స్టసీ) మాత్రలు, హైడ్రో గంజా, కొకైన్ తోపా టు విలువైన వస్తులు ఉన్నాయి.

బెంగళూరు రేవ్ పార్టీలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు, ఐపీఎల్ బెట్టింగ్ లు జరుగుతున్నట్లు సమాచారం ఉందని పోలీసు అధికారులు అంటున్నారు. దాడి తర్వాత పోలీసులు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో రేవ్ పార్టీలో పాల్గొన్న వారి నుండి రక్త నమూనాలను సేకరించారు, ఇందులో 59 మంది పురుషులు, 27 మంది మహిళలు డ్రగ్స్‌ సేవించినట్లు పాజిటివ్ వచ్చిందని పోలీసు అధికారులు తెలిపారు. నిందితులు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించారు.

బెంగళూరు రేవ్ పార్టీకి హాజరైన వారిలో ఎక్కువ మంది డ్రగ్స్‌ సేవించారని, పాజిటివ్‌గా తేలిన వారికి బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నోటీసులు జారీ చేసిందని పోలీసు వర్గాలు తెలిపాయి. మే 19వ తేదీ అర్ధరాత్రి వాసు పేరుతో బర్త్ డే పార్టీ ఏర్పాటు చేశారు. కానీ దీనికి ప్రవేశ రుసుము మాత్రమే రెండు లక్షల రూపాయల వరకు ఉందని, కొందరి దగ్గర ఇంకా ఎక్కువ మొత్తంలోనే వసూలు చేశారని బెంగళూరు పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Andhra Pradesh politicians pressuring Bengaluru police to release actress Hema in rave party case

ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో ప్రారంభమైన పార్టీ సోమవారం తెల్లవారుజాము వరకు కొనసాగింది. బెంగళూరు రేవ్ పార్టీకి 110 మందికి పైగా హాజరయ్యారు. ఐదుగురు వ్యక్తులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఇప్పటికే తెలిపారు. ఇప్పుడు తెలుగు సినీనటి హేమను వదిలేయాలని ఆంధ్రప్రదేశ్ లోని కొందరు రాజకీయ నాయకులు బెంగళూరు సీసీబీ పోలీసుల మీద ఒత్తిడి చేస్తున్నారని వెలుగు చూడటంతో ఆ రాజకీయ నాయకులు ఎవరు ? అని పలు పార్టీల నాయకులు ఆరా తీస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+