ఆ అధికారుల నుండి లంచం డబ్బులు తిరిగి ఇప్పించాను: చంద్రబాబు
ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం ఎవరికైనా లంచం ఇస్తే దాన్ని తిరిగి వారికే ఇప్పించే కొత్త విధానాన్ని శ్రీకారంచుట్టినట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు.
అమరావతి: ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం ఎవరికైనా లంచం ఇస్తే దాన్ని తిరిగి వారికే ఇప్పించే కొత్త విధానాన్ని శ్రీకారంచుట్టినట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు.
కాల్ సెంటర్ కు వచ్చే ఫిర్యాదుల ఆధారంగా విచారించి లంచం తీసుకొన్న మాట వాస్తవమే అయితే వాటిని తిరిగి ఇప్పిస్తున్నామని చెప్పారు.ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారాయన.
ఇప్పటివరకు 12 మంది నుండి లంచాలను తిరిగి ఇప్పించామన్నారు. లంచాలు తీసుకొన్నవారి పేర్లు మాత్రం ఆయన వెల్లడించలేదు. పెన్షన్ల మంజూరుపై 1.20 లక్షల పైగా ఫోన్ కాల్స్ వస్తే అందులో 4 శాతం అవినీతికి పాల్పడినట్టు ఫిర్యాదులు అందాయని చెప్పారు.

రేషన్ సరఫరాలో 1.25 శాతం అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు.కడప జిల్లాలో చంద్రన్న బీమా పథకం కోసం లబ్దిదారు నుండి వెయ్యిరూపాలు లంచం తీసుకొన్నారని ఫిర్యాదువచ్చిందని, విచారించి లంచం డబ్బులను తిరిగి వెనక్కు ఇప్పించినట్టు చెప్పారు బాబు.
కర్నూల్ జిల్లాలో పెన్షన్ మంజూరు చేయించేందుకు ఓ పంచాయితీ కార్యదర్శి రూ.500 తీసుకొంటే అతణ్ణి హెచ్చరించి అతను డబ్బులు తీసుకొన్న వారి నుండి వెనక్కు ఇప్పించామన్నారు. తాను ఎటువంటి అవినీతిని సహించబోనన్నారు. ఈ విషయంలో ప్రజలు 1100 నంబర్ కు తెలియజేయాలని కోరారు.












Click it and Unblock the Notifications