చిన్నారుల కళ్లలో కారంకొట్టి, వాతలు: ఓ టీచర్ కర్కశం

Angry teachers singe two girls
విజయవాడ: పిల్లలు చేసిన చిన్న నేరానికి ఓ ఉపాధ్యాయురాలు కర్కశంగా ప్రవర్తించింది. వారి కళ్లలో కారం కొట్టి, ఒంటి పైన వాతలు పెట్టి పైశాచికత్వాన్ని ప్రదర్శించింది. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసరలో క్రైస్తవ మిషనరీకి చెందిన ఓ విద్యా సంస్థ నర్సరీ నుండి ఇంటర్ వరకూ విద్యాసంస్థ, హాస్టల్ నిర్వహిస్తోంది.

సంస్థకు చెందిన పాఠశాలలో నందిగామ డివిఆర్ కాలనీకి చెందిన గుంజి రామారావు కుమార్తె గుంజి ద్వారక(7), గుంజి తేజస్వి (5)లు ఒకటి, రెండు తరగతులు చదువుతున్నారు. హాస్టల్‌లోనే ఉంటున్నారు. మంగళవారం రాత్రి పక్క విద్యార్థులకు చెందిన అప్పడం లాంటి తినుబండారం తిన్నారని, రూ.10లు దొంగిలించారని తోటి విద్యార్థులు ప్రధానోపాధ్యాయురాలు భాగ్యవతి, ఉపాధ్యాయురాలు సిస్టర్ ప్రభావతికి ఫిర్యాదు చేశారు.

దీంతో ఆగ్రహించిన వీరిద్దరూ గత రాత్రి ఈ చిన్నారుల కళ్లల్లో కారం కొట్టి చేతులు, కాళ్లపై కాల్చిన చువ్వతో వాతలు పెట్టారు. పిల్లలు సరిగా ప్రవర్తించడం లేదని తండ్రికి కబురు పంపారు.

ఆయన తన కుమార్తెలను పాఠశాల నుండి బయటకు తీసుకొచ్చిన తరువాత పిల్లలు తమ ఒంటిపై ఉన్న వాతలను, తండ్రి రామారావు కంచికచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చిన్నారులను నందిగామలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+