Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోదీ కేబినెట్ లో ఏపీకి మరో బెర్తు - చంద్రబాబు ఛాయిస్, పవన్ కొత్త లెక్కలు..!!

ఢిల్లీ కేంద్రంగా ఏపీలో కొత్త వ్యూహాల పైన మంత్రాంగం సాగుతోంది. బీహార్ గెలుపుతె బీజేపీ నాయకత్వం ఇప్పుడు ఇక భవిష్యత్ రాజకీయం పైన ఫోకస్ చేసింది. త్వరలో పలు రాష్ట్రాల్లో ఎన్ని కలు జరగనున్న వేళ కేంద్ర మంత్రివర్గ విస్తరణ దిశగా కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఏపీ నుంచి మరొకరికి కేంద్ర కేబినెట్ లో బెర్తు కల్పించాలని భావిస్తోంది. ఈ మేరకు కీలక ప్రతిపాదన లు తెర మీదకు వస్తున్నాయి. అయితే, ఇక్కడే అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో, ఎవరికి ఛాన్స్ దక్కుతుందనే చర్చ మొదలైంది.

ఏపీకి మరో కేంద్ర మంత్రి పదవి దక్కనుంది. బీహార్ లో ఘన విజయంతో మోదీ టీం ఇప్పుడు త్వరలో కీలక రాష్ట్రాల ఎన్నికల ను ఎదుర్కోనుంది. ఈ సమయంలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ దిశగా బీజేపీ అగ్రనాయకత్వం మిత్రపక్షాలతో చర్చిస్తోంది. అందులో భాగంగా ఏపీలో టీడీపీ, జనసేన రెండు పార్టీలు మిత్రపక్షాలుగా ఉండటంతో.. వారి నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తోంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లోనూ ఎన్నికలకు సమయం సమీపి స్తోంది. దీంతో.. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీ అధినాయకత్వానికి ప్రతిష్ఠాత్మకంగా మారుతు న్నాయి. ఈ రెండు రాష్ట్రాల కు మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత దక్కనుంది. తమిళనాడు మాజీ బీజేపీ చీఫ్ అన్నామైలకు కేంద్ర మంత్రి పదవి దాదాపు ఖాయమైంది. అదే సమయంలో ఏపీ నుంచి రెండు మిత్రపక్ష పార్టీలు ఉండగా.. కేంద్రంలో రెండు మంత్రి పదవులు ఉన్నాయి. ఏపీ బీజేపీ నుంచి ఒకరు కేంద్ర మంత్రిగా ఉన్నారు.

another-berth-for-alliance-parties-from-ap-in-central-cabinet-as-reports

ఏపీ నుంచి కేంద్రంలో టీడీపీ నుంచే ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. జనసేన నుంచి అప్పట్లో అవకాశం ఇచ్చినా.. పవన్ ఆసక్తి చూపలేదు. టీడీపీకి ఒక కేంద్ర మంత్రి, మరొకటి సహాయ మంత్రి పదవి దక్కాయి. ఏపీ కేబినెట్ లో బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయించారు. కాగా, ఇప్పుడు మారుతున్న సమీకరణాల్లో భాగంగా కేంద్ర కేబినెట్ లో ఏపీకి మరో బెర్తు ఇచ్చేందుకు బీజేపీ అధినాయకత్వం సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఏపీ కేబినెట్ లోనూ బీజేపీకి మరో మంత్రి పదవి పైన ప్రతిపాదన చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో సామాజిక సమీకరణాలు కీలకం కానున్నాయి. కేంద్ర కేబినెట్ లో మంత్రి పదవి తీసుకోవాలని పవన్ తాజా ఆలోచనగా తెలుస్తోంది. పవన్ నుంచి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. కాగా, అందులో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సీనియర్ గా ఉన్నారు. పవన ఛాయిస్ ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది.

కాగా, ప్రస్తుతం ఉత్తరాంధ్ర.. కోస్తా జిల్లాలకు కేంద్ర కేబినెట్ లో అవకాశం దక్కింది. దీంతో, ప్రాంతీయ - సామాజిక సమీకరణాల్లో భాగంగా రాయలసీమ నుంచి బీసీ లేదా ఎస్సీ వర్గానికి అవకా శం ఇవ్వాలనేది సీఎం చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. ఇందులో చిత్తూరు, హిందూపూర్ ఎంపీల్లో ఒకరికి అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో నుంచి రెడ్డి వర్గానికి అవకాశం పైనా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీంతో, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి పేరు పరిగణ లోకి తీసుకునే అవకాశం ఉంది. ప్రధాని మోదీ ఏపీ పర్యటన తరువాత.. చంద్రబాబు - పవన్ ఏపీ నుంచి ఎవరికి కేంద్ర కేబినెట్ లో అవకాశం ఇవ్వాలి.. తద్వారా ఏపీ కేబినెట్ లో నాగబాబు ఎంట్రీ.. మార్పుల గురించి తుది నిర్ణయం ఆధారంగా కేంద్ర కేబినెట్ లో కూటమి నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందనేది స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+