మరో ఎర్రచందనం స్మగ్లర్ అరెస్టు: సెల్ టవర్ ఎక్కి నిరసన
విజయవాడ: అంతర్జాతీయ స్మగ్లర్‌కు అనుచరుడు వీరంబాక సుదర్శన్‌ను నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీసులు బుధవారం ఆటోనగర్‌లో అరెస్ట్ చేశారు. లారీతో పాటు 40 ఎర్రచందనం దుంగలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి నెల్లూరు, తిరుపతిలో రూ.3కోట్ల ఆస్తులు, 15లారీలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

వాగులో పడి అన్నదమ్ముల మృతి
గుంటూరు జిల్లా నర్సరావు పేట మండలం పెట్లూరి వారి పాలెం సమీపంలోని ఓగేరు వాగులో పడి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. అన్న బాజీ 8వ తరగతి విద్యార్థి కాగా, తమ్ముడు మారుతి 6వ తరగతి చదువుతున్నాడు. వీరిద్దరూ తమ గేదెలను అటుగా తీసుకువెళ్లి వస్తుండగా వాగు దాటుతున్నప్పుడు ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది.
కడప జిల్లా ఒంటిమిట్టలో పెట్రోల్‌బంక్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ స్కూటర్‌ను ఢీ కొనడంతో రాంరెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. మరొకరు తీవ్రంగా గాయ పడ్డారు.
పొలం సమస్యను పరిష్కరించాలని కోరుతూ కడప జిల్లా లింగాలపల్లి మండలానికి చెందిన వికలాంగ రైతు నాగేశ్వరరెడ్డి బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. తన పొలం సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఎన్నోసార్లు అధికార్లు చుట్టూ తిరిగినా, వారు సమస్యను పరిష్కరించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. సమస్య పరిష్కారమయ్యే వరకూ సెల్ టవర్ దిగనని అతను స్పష్టం చేశాడు.












Click it and Unblock the Notifications