కాపు రిజర్వేషన్ల కేసులో ట్విస్ట్ -జోగయ్య పిటిషన్ పై హైకోర్టు కీలక నిర్ణయం..
ఏపీలో కాపు రిజర్వేషన్ల కేసులో ఇవాళ మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మాజీ మంత్రి హరిరామజోగయ్య దాఖలు చేసిన పిటిషన్ ఛీఫ్ జస్టిస్ కోర్టులోకి చేరింది.
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కాపు రిజర్వేషన్ల వ్యవహారం మరోసారి తెరపైకి వస్తోంది. కేంద్రం ఇచ్చిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాలో 5 శాతం కాపులకు కేటాయిస్తూ గతంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. దాన్ని వైసీపీ ప్రభుత్వం పక్కనబెట్టేసింది. దీంతో చంద్రబాబు నిర్ణయం అమలు చేయాలని కోరుతూ మాజీ మంత్రి హరిరామజోగయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పలు ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి.
కాపు రిజర్వేషన్ల అమలు కోరుతూ హైకోర్టులో మాజీ మంత్రి హరిరామజోగయ్య దాఖలు చేసిన పిటిషన్ పై ఇప్పటికే హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఇవాళ మరోసారి ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం.. కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్ లో పిటిషనర్ లేవనెత్తిన డిమాండ్ కు ఉన్న సామాజిక ప్రాధాన్యత దృష్ట్యా హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని సీజే ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ఇకపై ఈ పిటిషన్ పై విచారణను సీజే బెంచ్ చేపట్టబోతోంది.

సామాజికంగా వెనుకబడిన కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్లు రాష్ట్రంలో ఎప్పటినుంచో ఉన్నాయి. అయితే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడంతో దీనికి మోక్షం కలగలేదు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు మరోసారి ఈ హామీ ఇవ్వడంతో కాపులు ఈ విషయంలో చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి పెంచారు. దీంతో చంద్రబాబు సర్కార్ అప్పట్లో 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చే పరిస్ధితి లేకపోవడంతో.. కేంద్రం ఇచ్చిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాలో 5 శాతాన్ని కాపులకు కేటాయించింది. దీన్ని తాజాగా కేంద్రం కూడా సమర్ధించింది. అయినా వైసీపీ సర్కార్ అమలు చేయడం లేదని కాపులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై జోగయ్య హైకోర్టును ఆశ్రయించారు.












Click it and Unblock the Notifications