ఎగ్జామ్ లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు.. APMSRB నోటిఫికేషన్ రిలీజ్ !!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఆరోగ్య శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (APMSRB) జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) పరిధిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 529 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ముఖ్యంగా స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టులను భర్తీ చేయనుండటం వైద్య, పారామెడికల్ రంగ అభ్యర్థులకు మంచి అవకాశంగా మారింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 30, 2026లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నియామకాల్లో రాత పరీక్ష లేకపోవడం, మెరిట్ ఆధారంగా ఎంపిక జరగడం అభ్యర్థులకు మరింత ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు.

పోస్టుల వారీగా ఖాళీలు..
- స్టాఫ్ నర్స్ పోస్టులు: 419
- ఫార్మసిస్ట్ పోస్టులు: 24
- మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ (NPHCE) పోస్టులు: 86
మొత్తం ఖాళీలు: 529
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలోని వైద్య సంస్థల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
విద్యార్హతలు..
- స్టాఫ్ నర్స్ పోస్టులు - B.Sc Nursing లేదా General Nursing and Midwifery (GNM) ఉత్తీర్ణత
- AP Nursing Council (APNMC) రిజిస్ట్రేషన్ తప్పనిసరి
- ఫార్మసిస్ట్ పోస్టులు - D.Pharmacy లేదా B.Pharmacy ఉత్తీర్ణత లేదా ఏపీ ప్రభుత్వం గుర్తించిన Pharmacy Vocational Course పూర్తి చేసి ఉండాలి. AP Pharmacy Council రిజిస్ట్రేషన్ తప్పనిసరి
- మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టులు - ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత, గుర్తింపు పొందిన సంస్థ నుంచి 1½ సంవత్సరాల Multi Rehabilitation Worker Certificate Course పూర్తి చేసి ఉండాలి
వయోపరిమితి..
2026 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
వయో సడలింపు..
- SC/ST/EWS అభ్యర్థులకు - 5 సంవత్సరాలు
- దివ్యాంగులకు (PwBD) - 10 సంవత్సరాలు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర రిజర్వేషన్ కేటగిరీలకు కూడా వర్తించే సడలింపులు ఉంటాయి.
దరఖాస్తు ఫీజు..
OC అభ్యర్థులు: రూ.1,200
SC/ST/EWS/దివ్యాంగ అభ్యర్థులు: రూ.900
దరఖాస్తు ఫీజును ఆన్‌లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం..
ఈ నియామకాల్లో ఎలాంటి రాత పరీక్ష ఉండదు. పూర్తిగా విద్యార్హతల మెరిట్, అనుభవం, రిజర్వేషన్ నిబంధనలు ఆధారంగా తుది ఎంపిక చేపడతారు.
ఎంపిక ప్రక్రియలో భాగంగా:
- విద్యార్హతల మార్కులు
- సంబంధిత కౌన్సిల్ రిజిస్ట్రేషన్
- రిజర్వేషన్ నిబంధనలు
- ధ్రువపత్రాల పరిశీలన (Document Verification)
ఆధారంగా తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు.
జీతభత్యాలు..
ఎంపికైన అభ్యర్థులకు పోస్టు వారీగా ఈ కింది వేతనాలు అందజేస్తారు.
- స్టాఫ్ నర్స్: నెలకు రూ.27,675
- ఫార్మసిస్ట్: నెలకు రూ.23,393
- మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్: నెలకు రూ.23,494
అదనంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర సౌకర్యాలు, సెలవులు, విధి సంబంధిత ప్రయోజనాలు వర్తించే అవకాశం ఉంది.
దరఖాస్తు విధానం..
- APMSRB అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
- సంబంధిత పోస్టును ఎంపిక చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేయాలి.
- అవసరమైన ధ్రువపత్రాలు, ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
- దరఖాస్తు ఫీజు చెల్లించి ఫారాన్ని సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ అవసరాల కోసం దరఖాస్తు కాపీని ప్రింట్ తీసుకోవాలి.
ముఖ్యమైన తేదీ..
ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ: జూన్ 30, 2026












Click it and Unblock the Notifications