వివేకా కేసులో బిగ్ ట్విస్ట్..! సాక్షి రంగన్నను చంపేశారా ?

ఏపీలో ఆరేళ్ల క్రితం తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుది. ఆరేళ్లుగా రాష్ట్ర పోలీసులు, సీబీఐ దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న వివేకా ఇంటి వాచ్ మెన్ రంగన్న తాజాగా చనిపోయారు. అయితే ఆయన మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ భార్య సుశీలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసును అనుమానాస్పద మృతిగా పులివెందుల పోలీసులు నమోదు చేశారు.

another twist in ys Vivekananda reddy murder case witness ranganna death recorded as suspicious

వివేకా హత్య తర్వాత రెండేళ్ల వరకూ ఈ దారుణానికి పాల్పడిందెవరో బయటికి రాలేదు. అదే సమయంలో సీబీఐ ఎంట్రీ ఇచ్చింది. దీంతో సీబీఐకి వివేకా ఇంటి వాచ్ మెన్ గా ఉన్న రంగన్న హత్య ఎలా జరిగిందో పూసగుచ్చినట్లు వివరించాడు. దీంతో సీబీఐ పక్కాగా కేసులు నమోదు చేసి ఛార్జిషీట్ లు కూడా నమోదు చేసింది. ఇందులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, ఇతర నిందితుల పాత్ర కూడా బయటికి వచ్చింది. ఈ నేపథ్యంలో కీలక సాక్షిగా ఉన్న రంగన్న ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. వయోవృద్ధుడైన రంగన్నకు గతంలో కడప రిమ్స్ తో పాటు పలు ఆస్పత్రుల్లో చికిత్స కూడా ఇప్పించారు.

అయితే తాజాగా రంగన్న చనిపోయారు. ఉబ్బసం, శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న రంగన్న రెండు వారాల క్రితం కిందపడటంతో కాలికి గాయమైంది. ఆ తర్వాత అనారోగ్యంతో ఇంటివద్దే ఉంటున్న రంగన్న ఆరోగ్యం క్షీణించి ఊపిరాడటం లేదని చెప్పడంతో ఆయనకు రక్షణగా ఉంచిన కానిస్టేబుల్ సాయంతో కడప రిమ్స్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రంగన్న చనిపోయారు. దీనిపై ఆయన భార్య సుశీలమ్మ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగన్న మృతిని అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. ఈ కేసు విచారణాధికారిగా సీఐ ఉలసయ్యను నియమించారు. దీంతో రంగన్న మరణం ఈ కేసులో మరో మిస్టరీగా మారుతుందన్న అనుమానాలు మొదలయ్యాయి. పోలీసులు మాత్రం దర్యాప్తు చేయకుండా ఏదీ చెప్పలేమంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+