చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనురాధ హత్య కేసులో పురోగతి: జిల్లా బంద్‌కు కాపునాడు పిలుపు

By Pratap
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: చిత్తూరు మేయర్ కటారి అనురాధ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మేయర్‌ను అనురాధను చంపింది మోహన్ మేనల్లుడు చింటూ అని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చినట్లు తెలిసింది.

ఎనిమిది నెలలుగా మేయర్ దంపతులకు, చింటూకు మధ్య గల ఆర్థికపరమైన గొడవలే హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఐదుగురు నిందితులు పాల్గొన్నారని పోలీసులు గుర్తించారు. పోలీసు జాగిలాలు కూడా సంఘటనా స్థలం నుంచి నేరుగా చింటూ ఇంటి వరకు వచ్చి అగిపోవడం కూడా ఆ విషయాన్ని తెలియజేస్తున్నట్లు చెబుతున్నారు.

Anuradha murder case: Police probe advances

మేయర్ అనూరాధ హత్యకు నిరసనగా బుధవారం చిత్తూరు జిల్లా బంద్‌కు కాపునాడు పిలుపునిచ్చింది. రేపు జిల్లా వ్యాప్తంగా కాపునాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. మంగళవారంనాడు దుండగులు అనురాధను హత్య చేసిన విషయం తెలిసిందే. దాడిలో ఆమె భర్త మోహన్ తీవ్రంగా గాయప్డడారు.

చిత్తూరు మేయర్ కటారి అనురాధ హత్యను సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఖండించారు. ఈ ఘటన దురదృష్టకరమైనదిగా పేర్కొన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే బడేటి బుజ్జి, మేయర్‌ నూర్జహాన్‌ బేగంలు హత్యను అమానవీయమైన చర్యగా పేర్కొన్నారు.

English summary
Chittoor police continuing probe in mayor Anuradha's murder case and suspecting Chintoo.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X