SRH vs MI: కొంపముంచిన నమన్‌ధీర్.. ముంబైపై SRH ఘన విజయం!
'క్యాచెస్ విన్ మ్యాచెస్' అనేది క్రికెట్‌లో అత్యంత ప్రసిద్ధమైన నానుడి. క్యాచ్‌లు మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తాయని దీని అర్థం. ఈ నానుడికి వ్యతిరేకంగా కీలకమైన మూడు క్యాచ్‌లను వదిలేసి ముంబై ఇండియన్స్ మూల్యం చెల్లించుకుంది. చెత్త ఫీల్డింగ్, పేలవ బౌలింగ్‌తో 244 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. దాంతో ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఆరో పరాజయాన్ని మూటగట్టుకొని ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
బుధవారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ డేంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఇచ్చిన మూడు క్యాచ్‌లను నమన్ ధీర్ అందుకోలేకపోయాడు.
చెలరేగిన హెడ్, క్లాసెన్..
244 పరుగుల భారీ లక్ష్య ఛేధనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 249 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లతో 76), హెన్రీచ్ క్లాసెన్(30 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 65 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. అభిషేక్ శర్మ(24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45), సలీల్ అరోరా(10 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 30 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో అల్లా ఘజన్‌ఫర్(2/51) రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీసారు. జస్‌ప్రీత్ బుమ్రా(0/54) దారుణంగా విఫలమయ్యాడు.

అంతకుముందు ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. ర్యాన్ రికెల్టన్(55 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 123 నాటౌట్) అజేయ శతకంతో రాణించగా.. విల్ జాక్స్(22 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46), హార్దిక్ పాండ్యా(15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31) దూకుడుగా ఆడారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింగే(2/54) రెండు వికెట్లు తీయగా.. ఇషాన్ మలింగా, సాకిబ్ హుస్సేన్, నితీష్ కుమార్ రెడ్డి తలో వికెట్ తీసారు.
ఆ 3 క్యాచ్‌లు పట్టుంటే..
2, 30, 48 పరుగుల వ్యక్తిగత స్కోర్ల వద్ద ట్రావిస్ హెడ్ ఇచ్చిన క్యాచ్‌లను నమన్ ధీర్ నేలపాలు చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్‌పై నమన్ ధీర్ అందుకోలేకపోయాడు. అతని చేతి వేల్లను తాకుతూ బంతి సిక్సర్‌గా వెళ్లిపోయింది. అల్లా ఘజన్‌ఫర్ బౌలింగ్‌లో 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ట్రావిస్ హెడ్ ఇచ్చిన మరో క్యాచ్‌ను కూడా నమన్‌ధీర్ వదిలేసాడు. తన రెండు చేతులను తాకుతూ బంతి బౌండరీ వెళ్లిపోవడం గమనార్హం.
అశ్వని కుమార్ బౌలింగ్‌లో 48 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మూడోసారి ట్రావిస్ హెడ్ ఇచ్చిన క్యాచ్‌ను నమన్ ధీర్ జారవిడిచాడు. క్యాచ్ అందుకున్నా.. సమన్వయం కోల్పోయి బౌండరీ లైన్‌పై పడ్డాడు. దాంతో ఇది కూడా సిక్సర్‌గా మారింది. ఈ మూడు క్యాచ్‌లు కష్టతరమే అయినా.. ప్రొఫెషనల్ క్రికెటర్‌గా నమన్ ధీర్ స్థాయికి సునాయసంగా అందుకోవాల్సిన క్యాచ్‌లు . ఈ అవకాశాలతో ట్రావిస్ హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అభిషేక్ శర్మతో కలిసి 8.4 ఓవర్లలోనే తొలి వికెట్‌కు 129 పరుగులు జోడించి మ్యాచ్‌ను ముంబై నుంచి లాగేసుకున్నాడు.












Click it and Unblock the Notifications