హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్- వర్క్ ఫ్రమ్ పార్క్, సకల సదుపాయాలు..!!

హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు కొత్త కాన్సెప్ట్. ఇప్పటి వరకు ఆఫీసుల్లో.. వర్క్ ఫ్రం హోం కు పరిమితం అయిన ఉద్యోగం ఇక నుంచి పార్కుల్లోనూ చేసుకునే వెసులుబాటు కలగనుంది. ఇందు కోసం సైబరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ దాదాపు 300 పార్కులను సిద్దం చేస్తోంది. నామ మాత్ర పు ఫీజులు వసూలు చేయనున్నారు. ఉద్యోగుల కోసం వైఫై, వర్కింగ్‌ డెస్క్‌లు, చార్జింగ్‌ వంటి అన్ని సదుపాయాలు అందుబాటులోకి తెస్తున్నారు.

హైదరాబాద్ లోనే కాదు ఈ నగరాల్లోనూ ఇందిరమ్మ టవర్స్.. తీపికబురు చెప్పిన డిప్యూటీ సీఎం!
హైదరాబాద్ లోనే కాదు ఈ నగరాల్లోనూ ఇందిరమ్మ టవర్స్.. తీపికబురు చెప్పిన డిప్యూటీ సీఎం!

సైబరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ వినూత్న నిర్ణయం అమలుకు సిద్దమైంది. ఇకపై ఐటీ ఉద్యోగు లు ఆహ్లాదకర వాతావరణం మధ్య పార్కుల్లో నుంచి తమ విధులు నిర్వహించే అవకాశం లభించ నుంది. ఇందుకోసం 'వర్క్‌ ఫ్రమ్‌ పార్క్‌' సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీఎంసీ కమిషనర్‌ జి.సృజన తెలిపారు. ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతున్న వర్క్‌ ఫ్రమ్‌ హోం సంస్కృతిని దృష్టిలో పెట్టుకుని ఈ వినూత్న ఆలోచనకు సీఎంసీ రూపకల్పన చేసిందన్నారు.

Cyberabad Corporation Introduces Work From Park Facility for IT Employees here the details

ఉద్యోగుల్లో మానసిక ప్రశాంతతను పెంచి, పచ్చని ప్రకృత్యాలయంలో పనులు చేసుకునేలా ఈ సరి కొత్త కాన్సెప్ట్ ను ప్రవేశ పెట్టినట్లు వెల్లడించారు. దుబాయ్‌లో ప్రారంభమైన ఈ తరహా వర్క్ ఫ్రమ్ పార్క్ థీమ్‌ను స్ఫూర్తిగా తీసుకుని, భారతదేశంలోనే మొదటిసారిగా సైబరాబాద్ పరిధిలో దీనిని అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.

పండగపూట హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు.. వీడియో వైరల్
పండగపూట హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు.. వీడియో వైరల్

సాధారణంగా పార్కులను ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో నడక, వ్యాయామం కోసం వినియోగిస్తుంటారని, మిగిలిన సమయాల్లోనూ వాటిని సద్వినియోగం చేసుకునేలా ఈ ప్రాజెక్టును రూపొందించామని చెప్పారు. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, మాదాపూర్‌ ప్రాంతాల్లో పైలట్‌ ప్రాజెక్టు కింద రెండు చోట్ల ఈ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ పార్కుల్లో ఉద్యోగులు ల్యాప్‌టాప్ లతో కూర్చుని పనిచేసుకునేందుకు ప్రత్యేక వర్కింగ్‌ డెస్క్‌లు, ఫిక్స్‌డ్‌ చైర్లు, ల్యాప్‌టాప్‌ చార్జింగ్‌ పాయింట్లు, హైస్పీడ్‌ వైఫై సదుపాయాలు కల్పించనున్నట్లు కమిషనర్‌ సృజన వివరించారు.

భద్రత కోసం సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయడంతోపాటు అల్పాహారం, పానీయాల కోసం కియోస్క్‌ కేంద్రాలను కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వీటి నిర్వహణ ఖర్చుల కోసం నామమాత్రపు ఫీజు వసూలు చేయాలని భావిస్తున్నామని, పైలట్‌ ప్రాజెక్టు విజయవంతమైతే రాబోయే రోజుల్లో 30 నుంచి 40 పార్కులకు ఈ సదుపాయాన్ని విస్తరిస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+