దీపావళి నుంచి ఓటీటీలో అదిరిపోయే వెబ్ సిరీస్‌లు

ఈ పండుగ సీజన్‌లో థియేటర్ల సందడితో పాటు ఓటీటీ ప్రియులను అలరించేందుకు పలు కొత్త సినిమాలు, ఆసక్తికరమైన వెబ్‌సిరీస్‌లు డిజిటల్ వేదికలపైకి వచ్చేశాయి. థ్రిల్లర్స్, క్రైమ్ కామెడీలు, లవ్ స్టోరీల నుంచి యాక్షన్ డ్రామాల వరకు వివిధ ఓటీటీ సంస్థల్లో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రాల వివరాలను తెలుసుకుందాం.

వెంకటేష్ - త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
వెంకటేష్ - త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అనకాపల్లి

విక్రమ్‌ సహిదేవ్, సంధ్య, తారక్‌ పొన్నప్ప కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఖగేశ్‌ తమ్మినేని దర్శకత్వం వహించగా, దర్శకుడు త్రినాథరావు నక్కిన కథను అందించారు. ఇటీవల థియేటర్లలో అలరించిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్‌నెక్స్ట్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

18 ఏళ్ల జర్నీకి కొత్త మలుపు.. ఓటీటీ ఎంట్రీతో సంచలనం!
18 ఏళ్ల జర్నీకి కొత్త మలుపు.. ఓటీటీ ఎంట్రీతో సంచలనం!
OTT Exciting New Web Series Set to Premiere on Streaming Platforms from Diwali Onwards

ఐ యామ్ గేమ్

దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ థ్రిల్లర్ ఇది. కయాదు లోహర్, ఆంటోనీ వర్గీస్, మిస్కిన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం జియో హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.

బా బా బ్లాక్‌షీప్‌

గుణి మంచికంటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న కొత్తతరం క్రైమ్ కామెడీ చిత్రం ఇది. టిను ఆనంద్, ఉపేంద్ర లియాయే, మాల్వీ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సన్‌నెక్స్ట్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.

#బాలు గీత

అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రంలో సందీప్ సరోజ్, కేయురి జంటగా నటించారు. ప్రతాప్ కొల్లారెడ్డి దర్శకత్వం వహించిన ఈ పెళ్లి అనంతర ప్రేమకథ ప్రస్తుతం ఈటీవీ విన్ లో వీక్షకులను అలరిస్తోంది.

వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్న ఇతర చిత్రాలు, సిరీస్‌లు

అమెజాన్ ప్రైమ్ వీడియో: ది మంగూస్ (ఇంగ్లీష్ / తెలుగు), ది గ్రేటెస్ట్ (వెబ్‌సిరీస్ - ఇంగ్లీష్ / తెలుగు), క్యాంపస్ డ్రైవర్స్ (వెబ్‌సిరీస్ - ఇంగ్లీష్ / తెలుగు)
ఓట్టం తుల్లల్ (మలయాళం), నెట్‌ఫ్లిక్స్: దిల్వాలీ దివాలీ (హిందీ), ఎ డాగ్స్ పర్‌ఫెక్ట్ క్రిస్మస్ (ఇంగ్లీష్ / తెలుగు), టేకన్: నటాలీ హోలోవే (ఇంగ్లీష్ / తెలుగు),
కరోలినా కరోలైన్ (ఇంగ్లీష్), గెయిల్ డాటరీ అండ్ ది సెలబ్రిటీ సెక్స్ పాస్ (ఇంగ్లీష్), జియో హాట్‌స్టార్: మినియన్స్ అండ్ మాన్‌స్టర్స్ (ఇంగ్లీష్ / తెలుగు), సోనీలివ్: మీసయా మురుక్కు 2 (తమిళం / తెలుగు), జీ5: నూరుకోడి వానవిల్ (తమిళం), బ్లైండ్ గేమ్ (హిందీ), సన్‌నెక్స్ట్ : ఐసీయూ (మలయాళం),
బుక్ మై షో: హార్ట్ ఆఫ్ ది బీస్ట్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+