ఏపీలో మిగిలి మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్దం-నోటిఫికేషన్-పోలింగ్ ఇలా..?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్ని వరుసగా పూర్తి చేసుకుంటూ వస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం (AP SEC) ఇదే క్రమంలో మిగిలిన మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేయబోతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని 100 మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు, నగర పంచాయతీల్లో మున్సిపల్ ఎన్నికలు పూర్తిచేసిన ఎస్ఈసీ.. ఇప్పుడు మిగిలిన 23 పట్టణాలు, నగరాలు, నగర పంచాయతీల్లోనూ ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ వారంలోనే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది.

వైసీపీకి ఛాన్స్ దొరికింది అక్కడే- ఆ రెండు కారణాలు- ఆ ఒక్క పని చేసుంటే..?
వైసీపీకి ఛాన్స్ దొరికింది అక్కడే- ఆ రెండు కారణాలు- ఆ ఒక్క పని చేసుంటే..?

రాష్ట్రంలో మిగిలిన 23 పట్టణ స్దానిక సంస్థల్లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు వీలుగా ఈ నెల 11 లేదా 12 తేదీల్లో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం ఈ నెల 24 లేదా 25 తేదీల్లో ఆయా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తే రాష్ట్రంలోని మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తయినట్లు అవుతుంది.

AP SEC Likely to Issue Poll Notification for Remaining 23 ULBs This Week Voting Expected by Month-End
ఎంపీటీసీల్లో వెయ్యి మార్కు దాటిన వైసీపీ..! ఇంత ప్రభంజనంలోనూ..!
ఎంపీటీసీల్లో వెయ్యి మార్కు దాటిన వైసీపీ..! ఇంత ప్రభంజనంలోనూ..!

మరోవైపు ఈ నెల 13న తొలి విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. వీటికి తొలి విడత పోలింగ్ నవంబర్ 26న, రెండో విడత నవంబర్ 29న, మూడో విడత డిసెంబర్ 2న నిర్వహిస్తారు. ఈ ఎన్నికల నోటిఫికేషన్లను మూడు విడతలుగా విడుదల చేస్తారు. నవంబర్ 13, 16, 19 తేదీల్లో వరుసగా ఈ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. మరోవైపు సహకార ఎన్నికల్ని కూడా త్వరలో పూర్తి చేసేందుకు వీలుగా ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ లెక్కన అన్ని స్దానిక సంస్థల, సహకార ఎన్నికల్ని కూడా డిసెంబర్ లోగా పూర్తి చేసి కొత్త సంవత్సరంలోకి వెళ్లేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+