వెంకటేష్ - త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' వంటి క్లాసికల్ హిట్స్ తర్వాత విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం'. ఇంతకాలం వీరిద్దరి కలయికలో వచ్చిన చిత్రాలకు త్రివిక్రమ్ కేవలం రచయితగానే వ్యవహరించగా, తొలిసారిగా ఆయన దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించడం విశేషం.
భారీ అంచనాల నడుమ అక్టోబర్ 30న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాపై సర్వత్రా పాజిటివ్ టాప్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాలో నారా రోహిత్, నివేదా పెతురాజ్, రావు రమేష్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎస్. థమన్ సంగీతం అందించారు.

రూ. 110 కోట్ల భారీ బడ్జెట్.. రికార్డ్ బిజినెస్
హై బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ హక్కులు సుమారు రూ. 65 కోట్లకు అమ్ముడుకాగా, బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 70 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
థియేట్రికల్ రన్‌తో పాటు ఈ సినిమా డిజిటల్ రైట్స్‌పై కూడా భారీ క్రేజ్ నెలకొంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను రూ. 40 కోట్లకు పైగా వెచ్చించి సొంతం చేసుకున్నట్లు సమాచారం. సాధారణంగా థియేటర్లలో విడుదలై సుమారు నాలుగు వారాల గ్యాప్ తర్వాతే సినిమాలు ఓటీటీకి వస్తుంటాయి. ఈ లెక్కన 'ఆదర్శ కుటుంబం' నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే బాక్సాఫీస్ వద్ద సినిమా కలెక్షన్లను బట్టి ఈ తేదీల్లో కొద్దిపాటి మార్పులు ఉండే అవకాశం ఉంది. దీనిపై నెట్‌ఫ్లిక్స్ త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.














Click it and Unblock the Notifications
