కేంద్రం గుడ్ న్యూస్ - ఇక నుంచి వీరికీ ఆయుష్మాన్ భారత్ పథకం వర్తింపు..!!
కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయుష్మాన్ భారత్ పథకం మరింతగా విస్తరించేందుకు రంగం సిద్దం చేసింది. అందులో భాగంగా కొత్తగా మరో 89 వ్యాధుల చికిత్సను అందించేలా పథకంలో మార్పులు చేస్తోంది. ప్రస్తుతం 23 రకాల వ్యాధులకు ఈ పథకం కింద ప్రభుత్వాస్ప త్రుల్లో చికిత్సలు అందిస్తుండగా, వాటి సంఖ్యను 112కు పెంచుతున్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఈ కొత్త వ్యాధులకు చికిత్సను దేశ వ్యాప్తంగా అందించేందుకు తుది కసరత్తు చేస్తున్నారు.
కేంద్రం ఆయుష్మాన్ భారత్ పరిధి పెంచాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా ప్రస్తుతం 23 రకాల వ్యాధులకు ఈ పథకం కింద ప్రభుత్వాస్పత్రుల్లో అందుతున్న చికిత్సను 112 వ్యాధులకు పెంచనున్నట్టు జాతీయ ఆరోగ్య సంస్థ(ఎన్హెచ్ఏ) వర్గాలు వెల్లడించాయి. వాటిలో తీవ్ర అనీమియా, తీవ్ర రక్తపోటు, తీవ్ర బ్రాంకైటిస్, డయేరియా, గ్యాస్ట్రోఎంటెరైటిస్, మూత్రనాళ ఇన్ఫె క్షన్లు, కిడ్నీల్లో రాళ్లు, మధుమేహం సంబంధిత కొన్ని సమస్యలు, హెమరాయిడ్స్, డయాబెటిక్ రెటినోపతి, గ్లకోమా తదితర వ్యాధులను తాజాగా జాబితాలో చేర్చారు. ఆ జాబితాను పరిశీలించి ఈనెల 25వ తేదీలోగా తమ సూచనలు అందజేయాలంటూ రాష్ట్ర వైద్యఆరోగ్య సంస్థలకు ఎన్హెచ్ఏ సర్క్యులర్ జారీ చేసింది. రాష్ట్రాల నుంచి సూచనలు.. సలహాలను పరిగణలోకి తీసుకొని ఈ వ్యాధులకు చికిత్స పైన కొత్త మార్గదర్శకాలు జారీ కానున్నాయి.

కేంద్రం తాజా మార్గదర్శకాలు
రాష్ట్రాల నుంచి నివేదికల ఆధారంగా సవరించిన మార్గదర్శకాలు డిసెంబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయని ఎన్హెచ్ఏ వర్గాలు తెలిపాయి. తమ వద్ద అందుబాటులో ఉన్న మౌలిక సదుపా యాలు, వైద్య నిపుణులు, ఇతర సౌకర్యాల ఆధారంగా ఈ ప్యాకేజీల సంఖ్యను తగ్గించుకునే అవకాశం రాష్ట్రాలకు ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు నగదు రహిత చికిత్స అందించినందుకు ప్రభుత్వ ఆస్పత్రులకు రీయింబర్స్మెంట్ లభిస్తుందని వెల్లడించాయి. ఈ నిధులను ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల బలోపేతానికి, వైద్య పరికరాల కొనుగోలుకు, మందులు, వినియోగ వస్తువుల లభ్యతను నిర్ధార ణకు, నిర్వహణ ఖర్చులను భరించడానికి, అదనపు ఆరోగ్య నిపుణులను నియమించుకోవడానికి వినియోగించుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.













Click it and Unblock the Notifications
