పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం!
బంగారం, వెండి ప్రియులకు, ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో బుధవారం(నవంబర్ 18) భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు గురువారం(నవంబర్ 19) ఉదయం కూడా తీవ్ర ఒత్తిడిలోని కొనసాగుతున్నాయి. అమెరికా డాలర్ విలువ అనూహ్యంగా బలపడటం, ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ పెరగడం వల్ల బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు కిందికి దిగివచ్చాయి.
ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,36,840 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 1,25,350 పలుకుతోంది. ఇక కిలో వెండి ధర రూ. 1,69,420 వద్ద ట్రేడ్ అవుతోంది. కేరళ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 12,215 వద్ద, ఒక సవర (8 గ్రాములు) ధర రూ. 97,720 వద్ద అందుబాటులో ఉంది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు(నవంబర్ 19)
*చెన్నై మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,36,880 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 1,25,380 పలుకుతోంది. ఇక కిలో వెండి ధర రూ. 1,69,485గా ఉంది.
*ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,36,790 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 1,25,300 పలుకుతోంది. ఇక కిలో వెండి ధర రూ. 1,69,460గా నమోదైంది.
*ముంబై మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,36,590 ఉండగా.. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 1,25,300 పలుకుతోంది. ఇక కిలో వెండి ధర రూ. 1,69,460గా ఉంది.
*బెంగళూరు మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,36,780గా నమోదు కాగా.. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 1,25,290గా నమోదైంది. ఇక కిలో వెండి ధర రూ. 1,69,545 వద్ద ట్రేడ్ అవుతోంది.
*కోల్కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,36,390 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 1,24,940 పలుకుతోంది. ఇక కిలో వెండి ధర రూ. 1,69,485 వద్ద ట్రేడ్ అవుతోంది.
గమనిక: పైన పేర్కొన్నవి కేవలం సూచిక ధరలు మాత్రమే. వీటికి జీఎస్టీ, తరుగు, మజూరీ ఛార్జీలు అదనంగా వర్తిస్తాయి. స్థానిక బులియన్ మార్కెట్లు, ఆభరణాల దుకాణాలను బట్టి తుది బిల్లులో మార్పులు ఉంటాయి.
ధరలు ఒక్కసారిగా ఎందుకు పడిపోయాయి?
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో బుధవారం నాడు బంగారం ఫ్యూచర్స్ 3.24 శాతం తగ్గి రూ. 1,29,880 వద్ద, వెండి ఫ్యూచర్స్ ఏకంగా 5.26 శాతం కుప్పకూలి రూ. 1,60,775 వద్ద ముగిశాయి. ధరల పతనానికి ప్రధానంగా మూడు కీలక కారణాలు ఉన్నాయి. మొదటిది అమెరికన్ డాలర్ బలపడటం వల్ల ఇతర కరెన్సీలు కలిగిన దేశాలకు బంగారం కొనుగోలు ఖరీదుగా మారి అంతర్జాతీయ డిమాండ్ తగ్గింది. రెండోది అమెరికా ప్రభుత్వ బాండ్లపై రాబడి పెరగడంతో ఇన్వెస్టర్లు ఎలాంటి వడ్డీ రాని బంగారం వైపు మొగ్గు చూపడం తగ్గించారు. మూడోది అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాల కంటే ఎక్కువగా నమోదు కావడంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో కఠినంగా వ్యవహరించవచ్చన్న సంకేతాలు ధరలపై ఒత్తిడి పెంచాయి. అయితే పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు సురక్షిత పెట్టుబడిగా బంగారానికి కొంత మద్దతుగా నిలుస్తున్నాయి.














Click it and Unblock the Notifications
