2035 నాటికి అతిపెద్ద మతంగా ఇస్లాం-క్రైస్తవం వెనక్కి-హిందూమతంలో..! తాజా రిపోర్ట్..!

ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా అనుసరిస్తున్న మతంగా ఉన్న క్రైస్తవం రాబోయే రోజుల్లో రెండో స్ధానానికి పడిపోతుందా ?2035 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా ప్రస్తుతం రెండో స్ధానంలో ఉన్న ఇస్లాం (Islam) అవతరించబోతోందా ? భారత్ లో హిందూమతం జనాభా కూడా గణనీయంగా తగ్గనుందా ? ప్యూ రీసెర్చ్ సెంటర్ తాజా అధ్యయన అంచనాల్లో ఈ సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న జనాభా మార్పులపై ఈ అధ్యయన నివేదిక ఏం చెప్పిందో ఓసారి చూద్దాం.

టారిఫ్ లపై భారత్ కు అమెరికా గుడ్ న్యూస్- వాణిజ్య డీల్ చర్చల్లో కీలక హామీ..!
టారిఫ్ లపై భారత్ కు అమెరికా గుడ్ న్యూస్- వాణిజ్య డీల్ చర్చల్లో కీలక హామీ..!

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం మొదటి, రెండో స్ధానాల్లో ఉన్న క్రైస్తవం, ఇస్లాం జనాభా గణనీయంగా పెరుగుతోందని, అయితే ఇందులో ఇస్లాం జనాభా మరింత వేగంగా పెరుగుతుందని ప్యూ రీసెర్చ్ తెలిపింది. అయితే దీనికి ముస్లింలో జననాల రేటు ఎక్కువగా ఉండటమే కారణమని, మతమార్పిడుల పాత్ర చాలా స్పల్పమని ఈ నివేదిక పేర్కొంది. 2020 నుంచి 2025 మధ్య గమనిస్తే ప్రతీ ముస్లిం మహిళ జననాల రేటు 3.1గా ఉందని, అయితే క్రైస్తవ మహిళల్లో జననాల రేటు మాత్రం 2.5 మాత్రమే ఉందని తెలిపింది. మిగతా మతాల మహిళల్లో జననాల రేటు 1.6గా ఉందని వెల్లడించింది. ఓ తరం స్ధానంలో మరో తరం రావాలంటే అవసరమైన 2.1 స్థాయి కంటే ఇతి తక్కువని తెలిపింది.

Islam Set to Surpass Christianity by 2035 Pew Highlights Global Demographic Shift
US జాబ్ గ్రీన్ కార్డులపై కంపెనీలకు మరో షాక్..! తాజా రూల్స్ ప్రకటన..!
US జాబ్ గ్రీన్ కార్డులపై కంపెనీలకు మరో షాక్..! తాజా రూల్స్ ప్రకటన..!

2020లో ప్రపంచంలో 2.27 బిలియన్ల క్రైస్తవులు ఉంటే, 2.02 బిలియన్ల ముస్లింలు ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది. కానీ 2035 నాటికి క్రైస్తవుల జనాభా 2.52 బిలియన్లకు చేరుకోనుండగా.. ముస్లింల జనాభా మాత్రం 2.57 బిలియన్లకు చేరుతుందని పేర్కొంది. ప్రస్తుత ధోరణులు ఇలాగే కొనసాగితే, 2070 నాటికి ముస్లింల సంఖ్య 3.6 బిలియన్లకు పైగా ఉంటుందని, క్రైస్తవుల సంఖ్య 3 బిలియన్లకు కొంచెం తక్కువగా ఉంటుందని అంచనా వేస్తోంది. 2020 నుంచి 2070 మధ్య ప్రపంచ వ్యాప్తంగా మతాలవారీగా జనాభా పెరుగుదల రేట్లపై ప్యూ రీసెర్చ్ అంచనాల్లో ఈ గణాంకాలు బయటపడ్డాయి. అలాగే వచ్చే 40 ఏళ్లలో అమెరికా క్రైస్తవ మెజార్టీ దేశంగా ఉండబోదని మరో బాంబు కూడా పేల్చింది. ప్రస్తుతం అమెరికాలో 62 శాతం క్రైస్తవులు ఉండగా..2065 నాటికి 50 శాతానికి పడిపోతారని తెలిపింది.
2020 నుంచి 2070 మధ్య ప్రపంచ క్రైస్తవ జనాభా 30 శాతం పెరిగితే ముస్లిం జనాభా 80 శాతం పెరుగుతుందని కూడా పేర్కొంది.
అలాగే హిందువులు, యూదుల జనాభా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ప్రపంచ జనాభాలో వారి వాటా తగ్గుతుందని అంచనా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+