ఈ గ్రామ జనాభా 19 మందే! వరమా? శాపమా?

మనదేశంలో ఓ రెండు క్రికెట్ జట్లు కావాలంటే ఒక్క గల్లీలోనే ఇరవై మంది పిల్లలు సులభంగా దొరుకుతారు. కానీ, ఒక ఊరంతటికీ కలిపి కనీసం రెండు క్రికెట్ టీమ్‌లకు సరిపడా మనుషులు కూడా ఉండరంటే నమ్మగలరా? వినడానికి కాస్త వింతగా అనిపించినా.. ఈ భూగోళంపై అలాంటి ఒక గ్రామం ఉంది. అట్లాంటిక్ మహాసముద్రపు విరుచుకుపడే అలల నడుమ, పచ్చని కొండల మధ్య ప్రకృతి చెక్కిన ఒక అపురూప దృశ్యంలా ఈ ఊరు కనిపిస్తుంది. డెన్మార్క్ పరిధిలోని ఫారో దీవులలో, 'ఈస్టరోయ్' అనే ఐలాండ్‌లో ఉండే ఈ చిన్న ఊరి పేరే 'గ్జోగ్వు' (Gjogv). కేవలం 19 మంది మాత్రమే నివసించే ఈ చిన్న గ్రామం, ఆధునిక ప్రపంచపు హడావుడికి ఆమడ దూరంలో ప్రశాంతతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది.

ఈ గ్రామానికి ఆ పేరు రావడానికి ఇక్కడున్న ఒక ప్రత్యేకమైన ప్రకృతి వింతే కారణం. సముద్రపు కొండల మధ్య 200 మీటర్ల పొడవునా తొలచినట్లుండే ఒక సహజసిద్ధమైన జలసంధి (Gorge) ఇక్కడ ఉంటుంది. సాధారణంగా ఓడరేవులు కట్టాలంటే మనుషులు ఎంతో శ్రమిస్తారు, కానీ ఇక్కడ ప్రకృతి స్వయంగా జాలర్ల కోసం ఒక సురక్షితమైన దారిని ఏర్పాటు చేసింది. భయంకరమైన అట్లాంటిక్ సముద్రపు అలల నుంచి తమ పడవలను కాపాడుకోవడానికి స్థానిక జాలర్లు వందల ఏళ్లుగా ఈ జలసంధినే వాడుకుంటున్నారు. నిటారుగా ఉండే కొండల మధ్య నుంచి నీలిరంగు సముద్రం కనిపించే తీరు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది.

Discover Gj gv A Hidden Nordic Village Of 19 People Living Beside A Magnificent Ocean Gorge Feature

ఆకుపచ్చని కప్పులు.. నీటి అలల మధ్య పాతకాలపు జ్ఞాపకాలు

సముద్ర తీరం నుంచి ఊరి వైపు అడుగులేస్తే ఒక విచిత్రమైన వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడి ఇళ్లకు రంగురంగుల గోడలు, పైన పచ్చటి గడ్డితో కూడిన కప్పులు ఉంటాయి. వర్షం, ఈదురుగాలుల నుంచి ఇళ్లను కాపాడుకోవడానికి ఈ ఫారో దేశస్థులు వందల ఏళ్ల క్రితం కనిపెట్టిన సాంప్రదాయ పద్ధతి ఇది. ఊరి గుండా పారే చిన్న నీటి వాగు శబ్దం, మారిపోయే కొండల వెలుగులు తప్ప ఇక్కడ వేరే ఏ శబ్దాలూ వినిపించవు.

ఊరి మధ్యలో 1929లో కట్టిన ఒక పాత చర్చి ఉంటుంది. దాని పక్కనే సముద్రానికి వెళ్లిన భర్త కోసం నిరీక్షించే తల్లి, ఇద్దరు పిల్లల కాంస్య విగ్రహం కనిపిస్తుంది. సముద్రాన్నే నమ్ముకుని వేటకు వెళ్లి తిరిగి రాని జాలర్ల త్యాగాలను, ఆ కుటుంబాల వేదనను ఈ విగ్రహం మౌనంగా గుర్తుచేస్తూ ఉంటుంది.

భారత్ లో చిట్ట చివరి గ్రామం.. మిస్టీరియస్ ఘోస్ట్​ టౌన్ కు ఎలా వెళ్లాలి..?
భారత్ లో చిట్ట చివరి గ్రామం.. మిస్టీరియస్ ఘోస్ట్​ టౌన్ కు ఎలా వెళ్లాలి..?

మేఘాలను తాకే కొండలు.. పక్షుల పలకరింపులు

ఈ ఊరి చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలంటే కాలినడకన ప్రయాణించాల్సిందే. గ్జోగ్వు నుంచి పక్కనే ఉన్న 'ఫన్నింగూర్' గ్రామానికి వెళ్లే నాలుగు కిలోమీటర్ల పురాతన కాలిబాట పై నడుస్తుంటే, ఒకప్పుడు ఇక్కడి ప్రజలు కొండల మధ్య ఎలా ప్రయాణించేవారో అర్థమవుతుంది. పక్కనే ఉన్న 'అంబదాలూర్' లోయ నుంచి చూస్తే, సముద్రం మధ్యలో నుంచి ఆకాశంలోకి లేచినట్లుండే భారీ రాతి శిఖరాలు, వాటి చుట్టూ గుంపులు గుంపులుగా తిరిగే సముద్ర పక్షులు కంటికి విందు చేస్తాయి.

అంతేకాదు, ఫారో దీవుల్లోనే అత్యంత ఎత్తైన 'స్లాట్టారటిండూర్' (880 మీటర్లు) పర్వతం ఈ ఊరికి దగ్గరలోనే ఉంది. ఆకాశం నిర్మలంగా ఉన్న రోజున ఈ పర్వత శిఖరం పైకెక్కితే చుట్టూ ఉన్న 18 దీవులను ఒక్కసారిగా చూడవచ్చు!

ప్రకృతి సూత్రాలకే సవాల్ విసిరిన తాబేలు! బంగాళాఖాతం నుంచి అరేబియా కడలికి..
ప్రకృతి సూత్రాలకే సవాల్ విసిరిన తాబేలు! బంగాళాఖాతం నుంచి అరేబియా కడలికి..

వెళ్లాలనుకుంటే ఇవి గుర్తుంచుకోవాల్సిందే!

ఫారో దీవుల రాజధాని 'తోర్షావ్న్' నుంచి దాదాపు గంటసేపు కార్ డ్రైవింగ్ చేస్తే ఈ ఊరికి చేరుకోవచ్చు. సముద్రపు అడుగున నిర్మించిన సొరంగాల ద్వారా లేదా వంతెనల ద్వారా ఇక్కడికి ప్రయాణించవచ్చు. విదేశాల నుంచి వచ్చే వారు 'వాగర్' విమానాశ్రయం ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. అయితే ఇక్కడి వాతావరణం చాలా విచిత్రమైనది. క్షణాల్లో ఎండ తగ్గి, మబ్బులు కమ్మి భారీ వర్షం, వీధిగాలులు వీస్తాయి. కాబట్టి ఇక్కడికి వెళ్లేవారు రెయిన్ కోట్లు, తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

వేసవి కాలంలో రోజంతా వెలుతురు ఎక్కువగా ఉండి, ప్రకృతిని ఆస్వాదించడానికి అనువుగా ఉంటుంది. శీతాకాలంలో మంచు, మేఘాలు కమ్మేసి చీకటి వల్ల ప్రయాణం కాస్త కష్టంగా మారవచ్చు. హడావుడి జీవితానికి కాస్త విరామమిచ్చి, ప్రకృతి ఒడిలో ఊపిరి పీల్చుకోవాలనుకునే వారికి ఈ 19 మంది ఉండే చిన్న ఊరు ఒక స్వర్గధామం!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+