ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మిస్టేక్.. మిస్ అయిన గోల్డెన్ ఛాన్స్!

పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ బాక్సాఫీస్ స్టామినా కలిగిన కథానాయకులలో ఒకరు. ఆకాశమే హద్దుగా మార్కెట్ ఉన్నప్పటికీ.. కొన్ని ప్రాజెక్టుల విషయంలో ఆయన తీసుకున్న అనూహ్య నిర్ణయాలు, ఎంచుకున్న డైరెక్టర్లు ఆయన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశారు. ముఖ్యంగా హిందూ పవిత్ర ఇతిహాసం రామాయణం ఆధారంగా సినిమా చేయాలనే ఆలోచనతో ప్రభాస్ దర్శకుడు ఓం రౌత్‌ను నమ్మడం ఆయన కెరీర్లోనే ఓ పెద్ద రిస్క్‌గా మిగిలిపోయిందనే చర్చ సినీ వర్గాల్లో మళ్లీ మొదలైంది.

'రామాయణ' మూవీలో డిలీటెడ్ సీన్ వైరల్.. యాడ్ చేయాలంటున్న ఫ్యాన్స్
'రామాయణ' మూవీలో డిలీటెడ్ సీన్ వైరల్.. యాడ్ చేయాలంటున్న ఫ్యాన్స్

రామాయణం వంటి మహా కావ్యాన్ని వెండితెరపై ఆవిష్కరించేటప్పుడు డైరెక్టర్‌కు దృశ్య కావ్య నిర్మాణంపై అవగాహన, సాంకేతిక బృందం మద్దతు, స్పష్టమైన విజన్ ఉండాలి. భావోద్వేగాలను, దైవత్వాన్ని దెబ్బతీయకుండా తెరకెక్కించడమే అత్యంత కీలకం. కానీ ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చన ప్రాజెక్టు(ఆదిపురుష్) విజువల్స్ పరంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొనడమే కాకుండా.. శ్రీరాముడి పాత్రలో కనిపించిన ప్రభాస్ రూపాన్ని చూపించిన విధానంపై కూడా నెటిజన్లు, సినీ ప్రేక్షకుల నుంచి తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ ఎదురైంది. భారీ అంచనాలా మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.

Prabhas Biggest Career Risk How Adipurush Became a Major Missed Opportunity in his Career Details

అప్పుడు నితీష్ తివారీతో చేసి ఉంటే?
ఒకవేళ ప్రభాస్ కనుక రామాయణం కథను చేయాలని గట్టిగా నిశ్చయించుకుని ఉంటే డైరెక్టర్ నితీష్ తివారీ లేదా ప్రఖ్యాత నిర్మాత నమిత్ మల్హోత్రా లాంటి అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణుల బృందాన్ని నమ్మి ఉంటే ఫలితం మరోలా ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓ దైవికమైన స్టోరీకి ఎలాంటి గ్రాఫిక్స్, ఎలాంటి నిబద్ధత కావాలో సరిగ్గా ప్లాన్ చేసే టీమ్ దొరికి ఉంటే అది భారత్‌లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచేది.

పవిత్రమైన రామాయణానికి ఇదేం ప్రమోషన్? వైరల్ అవుతున్న ఫొటోలు!
పవిత్రమైన రామాయణానికి ఇదేం ప్రమోషన్? వైరల్ అవుతున్న ఫొటోలు!

రణ్‌బీర్ కపూర్ రామాయణం ప్రాజెక్టుపై చర్చ
ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నితీష్ తివారీ దర్శకత్వంలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న 'రామాయణం' ప్రాజెక్టులో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ విశేషాలు చూసిన వారు.. ప్రభాస్ కనుక ఇలాంటి ఓ విజనరీ ప్రొడక్షన్ సెటప్‌లో భాగమై ఉంటే ఆయన ఇమేజ్‌కు, బాక్సాఫీస్ రేంజ్‌కు సరిగ్గా సరిపోయేదని కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఓ మంచి ఇతిహాసానని తప్పుడు చేతుల్లో పెట్టడం వల్ల ప్రభాస్ ఓ అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకున్నారనేది టాలీవుడ్ వర్గాల మాట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+