MI vs SRH: సన్‌రైజర్స్ బౌలింగ్ ను చెడా మడా ఉతికేశాడు.. సుడిగాలి సెంచరీ

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ ర్యాన్ రికల్టన్ చరిత్ర సృష్టించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దుమ్ము లేపాడు. 44 బంతుల్లోనే అద్భుత శతకం బాదాడు. సన్ రైజర్స్ బౌలింగ్ ను తుత్తునీయలు చేశాడు. అతని సెంచరీతో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ అందుకుంది. నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ బౌలర్లు చేతులెత్తేశారు. పూర్తిగా విఫలం అయ్యారు.

తొలుత బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ ఇన్నింగ్ ను దూకుడుగా ఆరంభించింది. తొలి వికెట్ భాగస్వామ్యానికి ఏకంగా 93 పరుగులు జోడించింది. ఓపెనర్ విల్ జాక్స్, రియాన్ రికెల్టన్ వాంఖెడేలో మోత మోగించారు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. విల్ జాక్స్ 22 బంతుల్లో మూడు సిక్సర్లు, అయిదు ఫోర్లతో 46 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. నితీష్ కుమార్ అతన్ని బలి తీసుకున్నాడు. ఆఫ్ స్టంప్ కు దూరంగా వేసిన బంతిని ఫ్లిక్ చేయబోయి వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు జాక్స్.

Ryan Rickelton blasts fastest IPL 100 for Mumbai Indians breaks Sanath Jayasuriya s 15 Years record

సూర్యకుమార్ యాదవ్ మరోసారి విఫలం అయ్యాడు. అయిదు పరుగులే చేసి ఈషాన్ మలింగ బౌలింగ్ లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. ఆ తర్వాత వచ్చిన నమన్ ధీర్- 22, కేప్టెన్ హార్దిక్ పాండ్యా- 31 పరుగులతో ఫర్వాలేదనిపించారు. తిలక్ వర్మ ఏడు పరుగులతో సరిపెట్టుకున్నాడు. ఇలా వరుస వికెట్లు పడుతున్నప్పటికీ హీరోయిక్ ఇన్నింగ్ ఆడాడు రియాన్ రికెల్టన్. 55 బంతుల్లో 123 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఎనిమిది సిక్సర్లు, 10 ఫోర్లు అతని ఇన్నింగ్ లో నమోదయ్యాయి.

రికల్టన్ ఈ అద్భుతమైన ఘనతతో ఒకప్పటి శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య 17 రికార్డును బద్దలు కొట్టాడు. జయసూర్య 2008లో 45 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఈ సీజన్‌లోనే తిలక్ వర్మ కూడా 45 బంతుల్లో సెంచరీ చేసి జయసూర్య రికార్డును సమం చేశాడు. అయితే ఇప్పుడు రికల్టన్ మరింత వేగంగా సెంచరీ సాధించి అగ్రస్థానానికి చేరుకున్నాడు. కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్ల ప్రదర్శనలను కూడా రికల్టన్ అధిగమించాడు.

ఈ చారిత్రాత్మక విజయాన్ని ర్యాన్ రికల్టన్ తన కుటుంబ సభ్యుల సమక్షంలో సాధించడం విశేషం. వాంఖడే స్టేడియం స్టాండ్స్‌లో అతని తల్లిదండ్రులు, భాగస్వామి మ్యాచ్‌ను వీక్షించారు. సెంచరీ పూర్తి చేసిన తర్వాత, రికల్టన్ వారివైపు చూసి తన ఆనందాన్ని పంచుకుంటూ సంజ్ఞ చేశాడు. ఇది మ్యాచ్‌లోని అత్యంత ఆకట్టుకునే క్షణాలలో ఒకటిగా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+