ఏపీలో ఊహించని పరిణామాలు - బీజేపీ కీలక నిర్ణయం తీసుకోబోతోంది : వీర్రాజు సంచలనం..!!
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఏపీ ముఖ్యమంత్రి పైన కీలక వ్యాఖ్యలు చేసారు. మాఫియాలు ఏపీలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయంటూ దుయ్యబట్టారు. ఏపీ పర్యటనలో భాగంగా బీజేవైఎం యువ సంఘర్షణ యాత్ర ముగింపు సభలో పాల్గొన్న ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసారు. జగన్ రెడ్డి ఇప్పటికైనా గంజాయి నుంచి విముక్తి కల్పించాలని కోరారు. లేకుంటే యువత మిమ్మల్ని మింగేస్తుందని హెచ్చరించారు. త్రిపురలో ఒక్క సీటు లేకున్నా.. బీజేపీ జెండా ఎగరేసిందని గుర్తు చేసారు. ఏపీలోనూ త్రిపుర తరహాలోలో బీజేపీ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు.
Recommended Video

యువత జగన్ ను వ్యతిరేకంగా
గతంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా యువత రోడ్డెక్కిన యువత జగన్ కు మద్దతిచ్చిందని చెప్పారు. ఇప్పుడు అదే యువత జగన్ ను వ్యతిరేకంగా ఉందన్నారు. బాబు వెళ్లిపోయారు.. జగన్ వెళ్లిపోవటానికి సిద్దంగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. లిక్కర్, ల్యాండ్, శ్యాండ్ మాఫియాలే ఏపీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని ధ్వజమెత్తారు. మాఫియాలతో నడుస్తోన్న జగన్ ప్రభుత్వాన్ని క్షమించకూడదు.. సాఫ్ చేయాల్సిందేనంటూ వ్యాఖ్యానించారు. గంజాయి ఎక్కడ దొరికినా ఏపీ పేరే వినిపిస్తోంది.. ఇది బాధ కలిగిస్తోందని చెప్పుకొచ్చారు. అవినీతిలో మొదటి స్థానంలో ఉండేందుకు జగన్, కేసీఆర్ పోటీ పడుతున్నారని ఆరోపించారు. ఇంటింటికి కుళాయి నీళ్లు కల్పించేందుకు కేంద్రం రూ. 4500 కోట్లు ఇస్తే.. రాష్ట్రం రూ. 450 కోట్లు కూడా విడుదల చేయలేదన్నారు.

ఏపీలో త్వరలో కీలక పరిణామాలు
ఇద్దరు సీఎంలు రాయలసీమ నుంచి వచ్చినా అక్కడ వలసలు ఆపలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం నిధులిస్తోన్నా.. ఏపీ సరిగా అమలు చేయడం లేదన్నారు. ఏపీలో అప్పులు రూ. 97 వేల కోట్ల నుంచి రూ. 4 లక్షల కోట్లకు పెరిగాయన్నారు. తుగ్లక్ తరహాలో జగన్ మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చారని మంత్రి వ్యాఖ్యానించారు. జగన్ లిక్కర్ కింగే కాదు.. స్టిక్కర్ కింగ్ కూడా నంటూ విమర్శించారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో త్వరలో కీలక పరిణామాలు జరగబోతున్నాయంటూ బాంబు పేల్చారు.

అత్యంత కీలక నిర్ణయం దిశగా
ఎవరూ ఊహించని విధంగా ఏపీలో పరిణామాలు చోటు చేసుకుంటాయంటూ ఆసక్తి పెంచారు. బీజేపీ అధినాయకత్వం ఏపీ విషయం లో అత్యంత కీలక నిర్ణయం తీసుకోబోతందంటూ చెప్పుకొచ్చారు. సినిమాను మించేలా ఈ పరిణామాలు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఎవరికీ భయపడని జగన్..ఒక్క మోదీకే భయపడతారంటూ వీర్రాజు వ్యాఖ్యానించారు. వైసీపీని గద్దె దించే ఏకైక పార్టీ బీజేపీ అని ధీమా వ్యక్తం చేసారు. అదే సమయంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ జగన్ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. ఏపీలో కూడా కమల వికాసం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు.












Click it and Unblock the Notifications