అనర్హత వేటుకు రంగం సిద్దం - లిస్టులో ఆ నలుగురితో పాటుగా..!!
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయం ఆసక్తి కర మలుపులు తిరుగుతోంది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా ఇప్పుడు రాజ్యసభ పోరు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. టీడీపీ ఎమ్మెల్యే గంటా రాజీనామా స్పీకర్ ఆమోదించారు. ఇదే సమయంలో టీడీపీ, వైసీపీ నుంచి పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేసారు. వారి పైన చర్యలు ఖాయంగా కనిపిస్తోంది. దీంతో, వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నలుగురితో పాటుగా ఎవరి పైన అర్హత వేస్తారనేది చర్చగా మారుతోంది.
ఉత్కంఠ పోరు : ఏపీలోఅసెంబ్లీ ఎన్నికల వేళ రాజ్యసభ పోరు రాజకీయంగా ఉత్కంఠను పెంచుతోంది. ఏపీ నుంచి ఖాళీ కానున్న మూడు సీట్లకు వచ్చే నెలలో షెడ్యూల్ విడుదల కానుంది, అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగానే రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. సంఖ్య పరంగా ప్రస్తుతం ఖాళీ అయ్యే మూడు స్థానాలు వైసీపీకి దక్కాల్సి ఉంది. అయితే, వైసీపీలో ఎన్నికల్లో సీట్ల నిరాకరణ..కొత్త వారికి అవకాశం తో సీట్లు దక్కని ఎమ్మెల్యే లను తమ వైపు తిప్పుకొనేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని వైసీపీ గుర్తించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి అనుకూలంగా ఓటు వేయటంతో టీడీపీ అభ్యర్ది విజయం సాధించారు. దీంతో, ఈ సారి అలాంటి అవకాశం ఇవ్వకూడదని వైసీపీ డిసైడ్ అయింది.

వ్యూహ ప్రతి వ్యూహాలు : టీడీపీకి ప్రస్తుతం 23 మంది సభ్యుల బలం సాంకేతికంగా ఉంది. కానీ, అందులో నలుగురు వైసీపీ వైపు మళ్లారు. గంటా రాజీనామా ఆమోదించారు. ఇదే సమయంలో వైసీపీ నుంచి నలుగురు టీడీపీకి దగ్గరయ్యారు. వారి పైన అనర్హత వేటు దిశగా చర్యలు మొదలయ్యాయి. వైసీపీ ఫిర్యాదు ఆధారంగా ఆ నలుగురికి స్పీకర్ నోటీసులు జారీ చేసారు. ఇదే సమయంలో టీడీపీ నుంచి వచ్చిన నలుగురికి టీడీపీ ఫిర్యాదు ఆధారంగా నోటీసులు ఇచ్చారు. జనసేన కూడా తమ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యేపై ఇలాంటి ఫిర్యాదే చేసింది. వీరిపై అనర్హత వేటు వేయాలని ఆయా పార్టీలు కోరాయి. దీంత, స్పీకర్ వద్ద తొమ్మది మంది సభ్యుల పైన చర్యలు తీసుకోవటానికి వీలుగా కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తోంది. కేవలం వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన వారి పైనే వేటు వేస్తే ఎన్నికల వేళ ప్రతిపక్షాలకు విమర్శలకు అవకాశం ఉంటుందనే చర్చ రావటంతో, టీడీపీ నుంచి వైసీపీ నుంచి వచ్చిన వారి పైన వేటు వేస్తారానే వాదన వినిపిస్తోంది.

వేటు తప్పదా : దీని ద్వారా నిష్పక్షపాతగా వ్యవహరించిందనే అభిప్రాయం ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఇప్పుడు సీట్లు నిరాకరించిన వారు తమకు అనుకూలంగా ఓటు వేస్తారని టీడీపీ భావిస్తోంది. వారి విషయంలోనూ వైసీపీ ఆచూ తూచి వ్యవహరిస్తోంది. ఇప్పుడున్న లెక్కల ప్రకారం పది మంది వేటు పడితే సభలో సభ్యుల సంఖ్య 165కి చేరుతుంది. అప్పుడు ముగ్గురు రాజ్యసభ సభ్యులను గెలిపించుకోవటానికి ఒక్కో సభ్యుడికి 55 మంది మద్దతు అవసరం అవుతుంది. ఈ సారి టీడీపీకి ఒక్క సీటు లేకుండా..మూడు సీట్లు గెలుచుకోవటం ద్వారా రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేకుండా చేయాలనేది వైసీపీ లక్ష్యం. దీనికి అనుగుణంగా ఇప్పుడు వైసీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. దీంతో..అసెంబ్లీ ఎన్నికల ముందే ఏపీలో జగన్ వర్సస్ చంద్రబాబు రాజ్యసభ రాజకీయం ఆసక్తిగా మారుతోంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications