రోజాకు సస్పెన్షన్‌తో పాటు అలవెన్సులు నిలిపేయాలి: రానివ్వట్లేదు.. హైకోర్టులో పిల్

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ విషయంలో సోమవారం నాడు అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఓ వైపు హైకోర్టు తీర్పు, మరోవైపు టిడిపి ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు నేపథ్యంలో.. సభలో రోజా అంశంపై జరిగే చర్చ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇప్పటికే ఈ విషయంపై విడతల వారీగా భేటీ నిర్వహించిన ప్రివిలేజ్ కమిటీ తన నివేదికను ఈ రోజు అసెంబ్లీకి సమర్పించనుంది. శనివారం నాడు జరిగిన ఈ కమిటీ సమావేశానికి రోజా గైర్హాజరయ్యారు. అయినా కమిటీ తన నివేదికను అసెంబ్లీకి సమర్పించేందుకు సిద్ధమైన నేపథ్యంలో విపక్ష సభ్యులపై చర్యలు తప్పవంటున్నారు.

ఇప్పటికే రోజాపై ఏడాది సస్పెన్షన్ వేటు పడగా, తాజాగా కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పైనా వేటు పడే అవకాశాలు లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు అసెంబ్లీ సమావేశాలపై అందరిలోను ఆసక్తి నెలకొంది.

AP Assembly to debate on Roja suspension issue

సభలో అధికార టిడిపి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని సాక్షి మీడియాలో స్టోరీ వచ్చింది. ప్రభుత్వం అఫ్రజాస్వామ్యానికి, ద్వంద్వ ప్రమాణాలకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని అందులో వచ్చింది. ఈ సందర్భంగా రోజా సస్పెన్షన్ రూల్ 340(2) తదితరాలను ప్రస్తావించారు.

రోజా పైన ఏడాది పాటు సస్పెన్షన్ విధిస్తూ చేసిన తీర్మానం చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిన అవసరం లేదని చెబుతున్న టిడిపి, అదే తీర్పును హైకోర్టులో సవాల్ చేయడం ద్వంద్వం ప్రమాణాలకు నిదర్శనమని పేర్కొన్నారు.

శాసన వ్యవస్థలో న్యాయస్థానాలో జోక్యం చేసుకోలేవని ఓ వైపు చెబుతూ, హైకోర్టు మధ్యంతర తీర్పుపై స్టే కోరుతూ అప్పీల్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడం అన్నది శాసన సభ ఏకగ్రీవ తీర్మానం అఏని చెబుతారని, కానీ ఆ రోజు ప్రతిపక్షం వ్యతిరేకించిన అంశాన్ని ప్రస్తావించరని పేర్కొన్నారు.

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు స్వీకరించారు, కానీ రోజాను అసెంబ్లీలోకి రానివ్వడంలేదని, సభలో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేందుకు మైక్ ఇవ్వరని, కానీ సభలో వాడకూడని పదాలు అధికార పార్టీ సభ్యులు మాట్లాడుతారని.. ఇలా పలు అంశాల్లో ద్వంద్వ వైఖరి అని పేర్కొన్నారు.

రోజాపై ప్రివిలేజ్ కమిటీ...

సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన, టిడిపి ఎమ్మెల్యే అనిత పైన అనుచితంగా మాట్లాడిన రోజా పైన ఏడాది పాటు సస్పెన్షన్‌తో పాటు అలవెన్సులు నిలిపివేయాలని ప్రివిలేజ్ కమిటీ సభకు సూచించింది. అనితపై చేసిన వ్యాఖ్యలపై నోటీసులు ఇచ్చినా రోజా కమిటీ మందు హాజరు కాలేదని ఆక్షేపించింది. కమిటీ సోమవారం సభకు నివేదిక ఇచ్చింది.

ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డిల వివరణ పైన కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. కొడాలి నాని క్షమాపణ చెప్పినప్పటికీ, ఆయన పైన చర్యలను సభకు వదిలేసింది. మరోవైపు వైసిపి ఎమ్మెల్యేలు ఉదయం సభకు హాజరుకాకుండా లోటస్ పాండులో భేటీ అయ్యారు.

హైకోర్టులో పిల్

తనను సభకు అనుమతించడం లేదని రోజా హైకోర్టులో సోమవారం పిల్ దాఖలు చేసింది. రోజాను కోర్టుకు రానివ్వకపోవడంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రోజా తరఫు న్యాయవాది అందులో పేర్కొన్నారు. చంద్రబాబు, కోడెలపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు. దీనిపై విచారణను రేపటికి వాయిదా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+