ఓట్ల కోసమే పోలవరానికి జగన్-ప్రాజెక్టుపై శ్రద్ధ నిర్వాసితులపై ఏదీ-సోము ట్వీట్ వార్

పోలవరం ప్రాజెక్టు పురోగతిని పరిశీలించడానికి సీఎం జగన్ ఇవాళ అక్కడికి వెళ్లారు. జగన్ పోలవరం పర్యటన నేపథ్యంలో అక్కడి నిర్వాసితుల సమస్యపై ఆయన్ను బీజేపీ టార్గెట్ చేస్తోంది. ఇందులో భాగంగా ఏపీ బీజేపీ ఛీఫ్ సోము వీర్రాజు జగన్ పోలవరం టూర్ పై విమర్శలతో ట్వీట్ వార్ చేపట్టారు.

Recommended Video

    Polavaram Project : కేంద్రం నుండి 1600 కోట్ల బిల్లులు పెండింగ్ - Ys Jagan

    సీఎం జగన్ పోలవరం టూర్ కేవలం ఓట్ల కోసమేనని, అక్కడ జగన్ టూర్ షెడ్యూల్ చూస్తే ఈ విషయం ఇట్టే అర్ధమవుతుందని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ట్వీట్ చేశారు. పోలవరం ప్రాజెక్టు కట్టడంపై ఉన్న శ్రద్ధ.. తమ సర్వస్వాన్ని వదులుకున్న ముంపు ప్రాంత వాసులపై లేదనేది స్పష్టమవుతోందని తన ట్వీట్ లో సోము వీర్రాజు పేర్కొన్నారు. ఈ ధోరణిని ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంతమాత్రం సహించదని సోము వైసీపీ సర్కార్ ను హెచ్చరించారు.

    ap bjp chief somu veerraju tweet war on cm jagans polavaram visit, calls it as tour for votes

    సీఎం జగన్ తన పర్యటనలో కొంత సమయం అయినా పోలవరం పునరావాస ప్రాంతాల్లో పర్యటించి అక్కడి జనం పడుతున్న అవస్ధలను ప్రత్యక్షంగా పరిశీలించాలని సీఎం జగన్ డిమాండ్ చేశారు. అపరిశుభ్ర వాతావరణం వల్ల వచ్చే వ్యాధులతో అక్కడి ప్రజల జీవితాలు మరింత దుర్భరం కాకముందే తక్షణం అధికారులతో సమీక్షించి తగు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ను సోము వీర్రాజు డిమాండ్ చేశాారు. పోలవరంలో ప్రస్తుతం గోదావరి వరద కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడి గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. నిర్వాసితులకు ప్రత్యామ్నాయాలు చూపకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పోలవరం పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+