Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేబినెట్ కూర్పులో కొత్త ట్విస్ట్ : కొనసాగేదెవరు - వారికే ప్రాధాన్యత : తెర పైకి అనుభవం..!!

ఏపీ కేబినెట్ కూర్పులో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. ప్రస్తుత మంత్రివర్గంలోని 24 మంది తమ పదవులకు రాజీనామా చేసారు. ఆమోదానికి సిఫార్సు చేస్తూ గవర్నర్ వద్దకు ఫైల్ పంపారు. ఇక, కొత్త మంత్రివర్గం ఈ నెల 11న కొలువు తీరనుంది. అయితే, ఇప్పటి వరకు సీనియర్లను సైతం తప్పించి..పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని చెబుతూ వచ్చారు. అయితే, తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో సామాజిక సమీకరణాలతో పాటుగా అనుభవం ఉన్న వారి కొందరు అవసరమే అంశం తెర మీదకు వచ్చింది.

దీంతో..ప్రస్తుత మంత్రుల్లో కొనసాగే వారి సంఖ్య 6-7 వరకు ఉంటుందని విశ్వసనీయ సమాచారం. ముందస్తుగా అందరితోనూ రాజీనామాలు తీసుకోవటం ద్వారా..కొనసాగే మంత్రులు సైతం 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రి సైతం 11వ తేదీన మంత్రులంతా అందుబాటులో ఉండాలని సూచించారు.

సామాజిక సమీకరణాల్లో వీరికి ఛాన్స్

సామాజిక సమీకరణాల్లో వీరికి ఛాన్స్

ఇప్పటి దాకా సామాజిక సమీకరణాల్లో భాగంగా.. ప్రస్తుత మంత్రులు కర్నూలు నుంచి జయరాం.. తూర్పు గోదావరి నుంచి వేణు గోపాల క్రిష్ణ.. శ్రీకాకుళం నుంచి అప్పలరాజు.. ప్రకాశం నుంచి ఆదిమూలపు సురేష్.. పశ్చిమ గోదావరి నుంచి శ్రీరంగనాధ రాజు పేర్లు వినిపించాయి. అయితే, తాజాగా అనుభవం అనే అంశం పైకి రావటంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..బొత్సా పేరు సైతం తిరిగి రేసులోకి వచ్చింది. సీనియర్లలో వీరిద్దరే తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

అదే విధంగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మరింత ప్రాధాన్యం ఇచ్చే అవకాశముందని చెబుతున్నారు. సామాజిక సమీకరణాల పేరుతో ఎవరిని కొనసాగించినా..అది సీఎం ఇష్టమని పైకి చెబుతున్నా... విధాన పరమైన నిర్ణయంగా అందరినీ తప్పిస్తే ఎటువంటి సమస్యలకు అవకాశం ఉండదనే అభిప్రాయం కొందరు ముఖ్య నేతలు వ్యక్తం చేస్తున్నారు.

అనుభవం కోటాలో ఎవరెవరు

అనుభవం కోటాలో ఎవరెవరు

అయితే, బొత్సాకు ఇప్పటికే ఉత్తరాంధ్ర రీజనల్ ఇంఛార్జ్ బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అదే విధంగా చిత్తూరు..అనంతపురం బాధ్యతలను పెద్దిరెడ్డికి అప్పగించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో పాటుగా ఒక మహిళా మంత్రిని సైతం కొనసాగిస్తారని ప్రచారం సాగుతోంది.

ఇప్పటి వరకు కొనసాగిన కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రులుగా ఐదుగురికి అవకాశం ఇస్తే.. అందులో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఉన్నాయి. గిరిజన, మైనార్టీ, క్షత్రియ, వైశ్య, కమ్మ వర్గాల నుంచి ఒక్కొక్కొరికి స్థానం కల్పించారు. తొలి మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యం కంటే.. ఇప్పుడు మరింత అధికంగా ప్రాధాన్యత దక్కుతుందని తెలిసింది. సామాజిక కూర్పు, జిల్లాల అవసరాలు ప్రాతిపదికన మంత్రివర్గం ఏర్పాటుచేస్తారని చెబుతున్నారు.

సీఎం కూర్పు పై ఉత్కంఠ

సీఎం కూర్పు పై ఉత్కంఠ

అయితే, మంత్రివర్గ కూర్పు గురించి సీఎం జగన్ సొంతంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీంతో..ఎవరికీ సీఎం వ్యూహాలు అంతు చిక్కటం లేదు. సీనియర్లలో ఎవరిని కొనసాగించినా మిగిలిన వారి పైన ఎటువంటి ప్రభావం చూపుతుందనే లెక్కలు ఇప్పుడు వైసీపీలో ఆసక్తి కరంగా మారాయి.

సీఎం జగన్ కేబినెట్ కూర్పులో పూర్తిగా సామాజిక సమీకరణాలే ప్రాధాన్యతగా తీసుకుంటున్నట్లు కనిపిస్తోందని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఇప్పటి వరకు అవకాశం దక్కని వర్గాలకు ఈ సారి కేబినెట్ లో బెర్తులు ఖరారు అవుతాయని విశ్లేషిస్తున్నారు. ఓసీ వర్గాలకు ప్రయార్టీ తగ్గే ఛాన్స్ ఉందనేది మరో విశ్లేషణ.

Recommended Video

    AP New Districts: కొత్త జిల్లాలు - Registration Charges పెంపు | Oneindia Telugu
    ఎలక్షన్ టీం కావటంతో ఆచి తూచి

    ఎలక్షన్ టీం కావటంతో ఆచి తూచి

    2024 ఎన్నికల కోసం సిద్దం చేసుకుంటున్న కేబినెట్ కావటంతో పార్టీ - ప్రభుత్వ వాయిస్ బలంగా వినిపించే వారిని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. అనుభవం ఉన్న వారూ అసవరం అని మంత్రులు అంగీకరిస్తున్నారు. ఇప్పుడు అనుభవం అనే అంశమే ప్రస్తుత మంత్రుల్లో కొనసాగింపుకు ప్రాతిపదిక కానుంది. సామాజిక సమీకరణాల పేరుతో కొనసాగించే వారి పైన క్లారిటీ వచ్చినా.. అనుభవం అనే సమీకరణంతో ఎవరిని కొనసాగిస్తారనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారుతోంది దీని పైన జగన్ లెక్కలు ఏంటనేది మరి కొద్ది గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+