వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా: అసెంబ్లీ సమావేశాలకు ముందే, కీలక అంశాలపై చర్చ

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం.. గురువారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా.. అంతకు ముందే.. అంటే బుధవారం రోజున కేబినెట్‌ సమావేశం నిర్వహించాలని భావించింది ప్రభుత్వం. కానీ, ఆ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు తర్వాత ప్రకటించారు.

నవంబర్ 18న ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనుండడంతో.. అసెంబ్లీ ప్రారంభం కంటే ముందే.. కేబినెట్‌ సమావేశం నిర్వహించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.. ఇక, ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలక ఆర్డినెన్సులు అసెంబ్లీ ఆమోదానికి రానున్నాయి. ఈ ఏడాది జులై నుంచి ఇప్పటివరకు వివిధ శాఖలకు సంబంధించి 14 ఆర్డినెన్సులను ఏపీ ప్రభుత్వం జారీ చేయగా.. ఒకే రోజు 14 ఆర్డినెన్సులు అసెంబ్లీ, మండలి ముందుకు తీసుకొచ్చి.. ఆమోదింపజేసుకునేలా ప్రభుత్వం సిద్ధమైంది.

 AP cabinet meet postponed to November 18th

ఏపీ అగ్రికల్చర్‌ ల్యాండ్‌ చట్ట సవరణ, ఏపీ రైట్స్‌ ఇన్ ల్యాండ్‌ అండ్‌ పట్టాదారు పాస్‌బుక్స్‌ చట్ట సవరణ, ఏపీ పంచాయతీ రాజ్‌ చట్ట సవరణ, ఏపీ ప్రైవేట్‌ యూనివర్సిటీల చట్ట సవరణ, ఏపీ హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులెటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ చట్ట సవరణ, ఏపీ విద్యా చట్ట సవరణ, ఏపీ ఛారిటబుల్‌ అండ్‌ హిందూ రిలిజియస్‌ ఇన్సిటిట్యూషన్స్‌ అండ్‌ ఎండోమెంట్స్‌ చట్ట సవరణ, ఏపీ ఛారిటబుల్‌ అండ్‌ హిందూ రిలిజియస్‌ ఇన్సిటిట్యూషన్స్‌ అండ్‌ ఎండోమెంట్స్‌ చట్ట రెండో సవరణ, ఏపీ రెగ్యులేషన్‌ ఆఫ్‌ ట్రేడ్‌ ఇన్‌ ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌, ఫారిన్‌ లిక్కర్‌ చట్ట సవరణ, ఏపీ అసైన్డ్‌ ల్యాండ్‌ చట్ట సవరణ, ఏపీ బొవైన్‌ బ్రీడింగ్‌ చట్ట సవరణ, ఏపీ సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్స్‌ కో-కంట్రిబ్యూటరీ పెన్షన్‌ చట్ట సవరణ, ఏపీ మున్సిపల్‌ కార్పోరేషన్ల చట్ట సవరణ, ఏపీ సినిమా నియంత్రణ చట్ట సవరణను ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదింపజేసేందుకు అన్ని ఏర్పాటు చేసుకుంది.

జగన్‌ అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం

Recommended Video

సీఎం కేసీఆర్ పై మండి పడ్డ డీకే అరుణ || Oneindia Telugu

తాడేపల్లిగూడెంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేందర్‌, బొత్స సత్యనారాయణ, గౌతం రెడ్డి, ధర్మాన కృష్ణదాస్‌, బాలినేని, కన్న బాబులతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్తగా 5 పరిశ్రమలకు ఎస్‌ఐపీబీ గ్నీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు. కాగా, రూ.2,134 కోట్లతో 5 పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో 7,683 మంది ప్రత్యక్షంగా ఉద్యోగవకాశాలు రానున్నాయి. కంపెనీల ఏర్పాటుకు భూముల కేటాయింపు, పరిశ్రమలకు అందుబాటులో తగిన వనరులు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించనట్లు సమాచారం.

English summary
AP cabinet meet postponed to November 18th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X