ఏపీ కేబినెట్ భేటీ - రిజర్వేషన్లు, కొత్త ఉద్యోగాల పై కీలక నిర్ణయాలు..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్దమైంది. ఏపీ మంత్రివర్గ భేటీలో అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బిల్లు కు ఆమోదం తెలపనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు.. బీసీ రిజర్వేషన్ల పైన కేబినెట్ భేటీ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అదే విధంగా బీసీ రక్షణ చట్టం.. అమరావతిలో భూ సమీకరణ వంటి అంశాల పైన చర్చించనున్నారు. జాబ్ క్యాలెండర్ కు అనుగుణంగా ఉద్యోగాల భర్తీ పైనా నిర్ణయం తీసుకోనున్నారు.
అసెంబ్లీ సమావేశాల వేళ ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలుకు సిద్దం అవుతోంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై మంతులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలే ప్రధాన అజెండాగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీపై ముందుకు వెళ్లే అంశంపై మంత్రులతో సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు.

దాదాపు 55కు పైగా అజెండా అంశాలతో మంత్రులు సమావేశం కానున్నారు. పరిశ్రమలు, ఐటీ, ఇంధనం, పర్యాటక రంగాలపై క్యాబినెట్‌లో చర్చించనున్నారు. ఇటీవల పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రులు ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది.
కాగా, తిరుపతి, సూర్యలంక, కేశరపల్లి, కాకినాడలో స్టార్ హోటళ్ల ఏర్పాటు ప్రతిపాదనలను ఆమోదించనున్నారు. ఇంధన రంగంలో హైబ్రిడ్, సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటు ప్రతిపాదనలపైన చర్చించి.. నిర్ణయం తీసుకోనున్నారు. అమరావతి రైల్వేలైన్ కోసం ల్యాండ్ పూలింగ్‌పై మత్రులు ఓ నిర్ణయం తీసుకోనున్నారు. మేయర్ల ప్రత్యక్ష ఎన్నికలకు చట్ట సవరణ ప్రతిపాదనలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు.
10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ప్రకటనపై నిర్ణయం తీసుకోనున్నారు. బీసీ విద్యార్థులకు IIT-JEE, NEET కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నారు. ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు బిల్లుపై క్యాబినెట్‌లో మాట్లాడనున్నారు. ఉన్నత విద్యలో ఫీజుల నిర్ణయానికి.. కొత్త కమిషన్ బిల్లుకు ప్రతిపాదనపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications