ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతమ్ అదానీ భేటీ..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి లోకేష్ కూడా పాల్గొన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో అదానీ గ్రూప్ చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రానున్న రోజుల్లో పెట్టబోయే పెట్టుబడులపై సమావేశంలో చర్చించినట్టు సమాచారం.
మరోవైపు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మీటింగ్ లో సీఎం పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం తరఫున వారికి 7 వరాలు ప్రకటించారు. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఇకపై దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్టు వెల్లడించారు. స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్‌లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేస్తామని తెలిపారు. ఆర్థిక సబ్సిడీ పథకాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అందించినట్టుగానే దివ్యాంగులకు మళ్లీ ప్రారంభిస్తామన్నారు.













Click it and Unblock the Notifications