ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు

రాష్ట్రంలోని ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీటిని నిరంతరాయంగా అందించడమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. జల్ జీవన్ మిషన్ (JJM) 2.0 కింద 2028 డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇచ్చే లక్ష్యాన్ని సాకారం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MoU) కార్యక్రమంలో ఆయన అమరావతి నుండి వర్చువల్‌గా పాల్గొన్నారు.

గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ (O&M) కు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి 2025 సెప్టెంబర్‌లోనే సమగ్ర విధానాన్ని ప్రకటించామని గుర్తు చేశారు. తాగునీటి వ్యవస్థల ఆపరేషన్ బాధ్యతను పంచాయతీలకే అప్పగించామని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ మిషన్ అమలుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని కొనియాడారు. జేజేఎం గడువును 2028 వరకు పొడిగించినందుకు ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సహకరించాలని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరారు.

AP CM Chandrababu Naidu Har Ghar Jal Goal by 2028 Historic MoU Signed for Jal Jeevan Mission 2 0

నీటి నాణ్యత పరీక్షల్లో డ్వాక్రా మహిళల పాత్ర

కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ మాట్లాడుతూ, ఏపీలో నీటి నాణ్యతను పరీక్షించే బాధ్యతలో డ్వాక్రా మహిళల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 16 కోట్ల గృహాలకు కుళాయిలు ఇచ్చామని, మిగిలిన 3 కోట్ల ఇళ్లకు జేజేఎం 2.0 ద్వారా నీరందిస్తామని చెప్పారు. ఈ పథకం ద్వారా సుమారు 9 కోట్ల మంది మహిళలకు నీటి కోసం పడే కష్టాలు తప్పుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యం నెరవేరాలంటే ప్రతి ఇంటికీ సురక్షిత నీరు చేరడం ప్రాథమిక అవసరమని ఆయన పేర్కొన్నారు.

మారుమూల ప్రాంతాలకు 'పీఎం జన్ మన్' నిధులు

మారుమూల మరియు గిరిజన ప్రాంతాలకు తాగునీటిని అందించేందుకు పీఎం జన్ మన్, పీఎం జన్ భాగీదారీ నిధులను వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. త్వరలోనే ఏపీలోని జిల్లా కలెక్టర్లతో వర్చువల్ సమావేశం ఏర్పాటు చేసి ప్రాజెక్టు లక్ష్యాలను నిర్దేశించుకుందామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తి మేరకు మిషన్ పొడిగింపునకు సానుకూలంగా స్పందించినట్లు పాటిల్ వెల్లడించారు.

ఢిల్లీలో ఎంఓయూపై సంతకాలు

ఢిల్లీలోని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర జల్ శక్తి కార్యదర్శి అశోక్ కుమార్ మీనా, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన మరియు పంచాయతీల ఆధ్వర్యంలో కుళాయిల నిర్వహణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అమరావతి నుండి వర్చువల్‌గా పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+