బాబు చెప్పారు, జియామీ స్పందించింది: విశాఖలో స్వదేశీ తయారీ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరణ
విశాఖ: భారత దేశంలో తయారైన తొలి స్వదేశీ స్మార్ట్ ఫోన్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు విశాఖపట్నంలో ఆవిష్కరించారు.
ఈ ఏడాది ప్రథమార్థంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చైనాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చంద్రబాబు ఇచ్చిన 'మేకిన్ ఇండియా', 'మేకిన్ ఆంధ్రప్రదేశ్' పిలుపునకు చైనాకు చెందిన జియామీ సంస్థ స్పందించింది.
రికార్డు సమయంలో జియామీ సంస్థ భారత్‌లో సెల్‌ఫోన్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. తమ యూనిట్లో స్మార్ట్ ఫోన్‌ను రూపొందించింది. దీనినే చంద్రబాబు సోమవారం నాడు విశాఖలో ఆవిష్కరించారు.
కాగా, జియోమీ సంస్థ భారత దేశంలో తమ సంస్థను మరింత విస్తరిస్తామని ఆదివారం నాడు తెలిపింది. జియోమీ.. చైనీస్ లో కాస్ట్ స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్. అంతేకాదు, ఈ జియోమీ స్మార్ట్ ఫోన్ తయారీలో ప్రపంచంలో మూడో అత్యంత పెద్ద సంస్థ.

జగన్ పైన అచ్చెన్నాయుడు ఆగ్రహం
ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ జగన్ ఢిల్లీలో చేస్తున్న దీక్షపై మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం మండిపడ్డారు. చనిపోయిన పార్టీ ఉనికిని రాష్ట్రంలో మళ్లీ బతికించుకునేందుకే ధర్నా చేస్తున్నారన్నారు.
ఏపీకి జరిగిన నష్టంపై విభజన అనంతరం ఒక్కసారి కూడా మాట్లాడని జగన్ ఇప్పుడు హోదాపై దీక్ష చేయడమేంటన్నారు. ఆయనదంతా రాజకీయ డ్రామా అన్నారు. దానివల్ల ఒరిగిందేమి లేదన్నారు. వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు కలసి వారి స్వార్థం కోసం నాటకాలాడుతున్నాయని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications